London: బట్టతల ఉందన్న కారణంతో ఒక వ్యక్తిని పంపెనీ నుంచి తొలగించారు. తన బట్టతలను చూపిస్తూ వివక్షకు గురిచేయడంతో పాటు తనను ఉద్యోగం నుంచి తొలిగించడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన నష్టాన్ని, వివక్షను కోర్టుకు తెలిపాడు.
Baldness: బట్టతల ఉందని సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్య మాములుగా లేదు. ఈ క్రమంలోనే ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. బట్టతల ఉందని ఒక ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించారు. తన బట్టతలను చూపిస్తూ వివక్షకు గురిచేయడంతో పాటు తనను ఉద్యోగం నుంచి తొలిగించడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన నష్టాన్ని, వివక్షను కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధితుడికి రూ.70 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకెళ్తే.. ఇంగ్లాండ్ లోని లోని గ్లాండ్‌కు చెందిన మార్క్ జోన్స్.. టాంగో నెట్‌వర్క్ అనే మొబైల్ ఫోన్ల సంస్థలో సేల్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, అతనికి బట్టతల ఉందన్న కారణంతో అతని బాస్ ఉద్యోగం నుంచి తొలగించాడు. బట్టతల ఉన్నఆ వ్యక్తిని వింత కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారు. విచిత్రమేమిటంటే అతడిని ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తి బాస్ ఫిలిప్ హెస్కెత్ కూడా బట్టతల ఉంది.
undefined
61 ఏళ్ల మార్క్ జోన్స్ యూకేలోని లీడ్స్ కు చెందిన మొబైల్ ఫోన్ సంస్థ టాంగో నెట్ వర్క్ లో సేల్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. బట్టతల ఉన్న అతని బాస్ ఫిలిప్ హెస్కెత్ తనకు "50 సంవత్సరాల బట్టతల ఉన్న పురుషుల బృందం" వద్దని నిర్ణయించుకున్నాడు. తన బృందంలో ఎక్కువ మంది యువకులు, శక్తివంతమైన అభ్యర్థులు ఉండాలని కోరుకున్న అతను, వయస్సు ఎక్కువగా, బట్టతల ఉన్న వారిని తొలగించారు. ఈ క్రమంలోనే బాధితుడు కోర్టును ఆశ్రయించాడని ఇండిపెండెంట్ నివేదించింది.
ఆ వెంటనే కంపెనీ సాకులు చెప్పి అతడిని దూరం చేసేందుకు ప్రయత్నించిందని జోన్స్ భావించాడు. చివరకు తనకు అన్యాయం జరగడంతో రాజీనామా చేసి ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేశారు. చిల్లర రాజకీయాలు, తనను చెడ్డవాడిగా చూపించే కుట్ర జరుగుతోందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గ్రీవెన్స్ రిపోర్టులో పేర్కొన్న అవాస్తవాలు, అబద్ధాల పట్ల తాను చింతిస్తున్నానని, ఇది కేవలం తనను చెడ్డవాడిగా చూపించడానికి, మొదట చేపట్టకూడని పనితీరు నిర్వహణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడానికి టిక్ బాక్స్ వ్యాయామంగా మాత్రమే రూపొందించబడిందని నమ్ముతున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కోర్టు విచారణ జరిపింది. టాంగో నెట్ వర్క్ ఎటువంటి ఆధారం లేకుండా జోన్స్ ను అన్యాయమైన కారణాలతో తొలగించిందనీ, అతనికి రూ .70 లక్షలు లేదా 71,000 పౌండ్ల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. బట్టతలను ఎత్తిచూపితే పని ప్రదేశంలో లైంగిక వేధింపులుగా పరిగణిస్తామని యూకే కోర్టు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ గత ఏడాది తీర్పునిచ్చింది.