పుల్వామా ఘటన: మోడీపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 28, 2019, 5:24 PM IST
Highlights

పుల్వామా ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తమ అదుపులో వున్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించిన ఇమ్రాన్ అనంతరం పుల్వామా సంఘటనను ప్రస్తావించారు

పుల్వామా ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తమ అదుపులో వున్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించిన ఇమ్రాన్ అనంతరం పుల్వామా సంఘటనను ప్రస్తావించారు.

కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం వల్లే మోడీ శాంతికి అనుకూలంగా స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరుగుతుందని తాము ముందే భయపడుతున్నామన్నారు.

అనుకున్నట్లుగానే పుల్వామా ఘటన జరిగిందని ఇమ్రాన్ అన్నారు. పుల్వామా ఘటన చేసింది భారత ప్రభుత్వమని చెప్పలేమని, అయితే ఘటన జరగగానే పాకిస్తాన్‌పై విమర్శలు చేయడంలో రాజకీయం దాగివుందని ఇమ్రాన్ ఆరోపించారు. ఎన్నికలు ముందున్నాయి కాబట్టే మోడీ శాంతికి అనుకూలంగా స్పందించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 

click me!