ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 14, 2019, 11:13 AM ISTUpdated : Aug 14, 2019, 03:41 PM IST
ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

సారాంశం

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో మింగలేక కక్కలేకుండా ఉన్న పాకిస్తాన్.. భారత్‌పై మరోసారి విషం కక్కింది. కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎదుర్కోవాలంటే జీహాద్ ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో మింగలేక కక్కలేకుండా ఉన్న పాకిస్తాన్.. భారత్‌పై మరోసారి విషం కక్కింది. కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎదుర్కోవాలంటే జీహాద్ ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ.  

బుధవారం పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆరీఫ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ రద్దుపై భారత్‌ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టాలని భావించిన పాకిస్తాన్‌కు ఆయా దేశాల నుంచి మద్ధతు కరువవ్వడంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.

ఈ విషయాన్ని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా అంగీకరించారు. కాశ్మీర్ అంశంలో భారత్ దూకుడును అడ్డుకోవడంలో విఫలమైందని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రజలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?