ఆర్టికల్ 370 రద్దు: ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, పాక్ విదేశాంగ మంత్రి ఆక్రోశం

Siva Kodati |  
Published : Aug 13, 2019, 12:12 PM IST
ఆర్టికల్ 370 రద్దు: ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, పాక్ విదేశాంగ మంత్రి ఆక్రోశం

సారాంశం

కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ రద్దుపై భారత్‌ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టాలని భావించిన పాకిస్తాన్‌కు ఆయా దేశాల నుంచి మద్ధతు కరువవ్వడంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా అంగీకరించారు.

కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ రద్దుపై భారత్‌ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టాలని భావించిన పాకిస్తాన్‌కు ఆయా దేశాల నుంచి మద్ధతు కరువవ్వడంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.

ఈ విషయాన్ని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా అంగీకరించారు. కాశ్మీర్ అంశంలో భారత్ దూకుడును అడ్డుకోవడంలో విఫలమైందని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు.

కాశ్మీర్ అంశంలో భారతదేశంపై పాకిస్తాన్ చేయబోయే ఫిర్యాదును స్వీకరించడానికి భద్రతా మండలి సిద్ధంగా లేదని ఖురేషీ ఘాటుగా బదులిచ్చారు. కశ్మీర్‌ను అడ్డుపెట్టుకుని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం సులభం.. కానీ ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టమన్నారు.

ఐరాస శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డుపడొచ్చని ప్రజలు విచక్షణతో ఆలోచించాలని చురకలు అంటించారు. కాశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్ధతుగా నిలిచిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాశ్మీర్‌పై అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే చైనాలో పర్యటించిన ఖురేషీ.. పాకిస్తాన్‌కు చైనా అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కాశ్మీర్ నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత అంశమని స్పష్టం చేశారు.  

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..