
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. యుద్ధాన్ని ఎలా ఆపాలా అని ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించి వార్తల్లో నిలిచారు. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు ప్రయత్నిస్తున్న సమయంలోనే... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో (vladimir putin) మాస్కోలో సమావేశమయ్యారు ఇమ్రాన్. ఈ సందర్భంగా పుతిన్ వద్ద ఇమ్రాన్ ఖాన్ ... కశ్మీర్ (jammu and kashmir) అంశాన్ని ప్రస్తావించారు. రష్యాతో దీర్ఘకాలిక బహుముఖ సంబంధాలకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం అత్యవసరమని పునరుద్ఘాటించారు.
రెండ్రోజుల పర్యటన నిమిత్తం రష్యా వచ్చిన ఇమ్రాన్ ఖాన్... పుతిన్ తో దాదాపు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. గడిచిన 23 ఏళ్లలో ఓ పాక్ ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పర్యటనపై పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. "దక్షిణాసియాలోని పరిస్థితులను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టికి తీసుకెళ్లారు. భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని ఎత్తి చూపారు. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం అత్యావశ్యకం అని ఇమ్రాన్ ఖాన్.. పుతిన్ కు తెలియజేశారు" అని పాక్ ప్రభుత్వం పేర్కొంది.
ఇకపోతే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (ukraine russia crisis) ప్రకటించడంతో.. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ (pakistan) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (imran khan) మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటన పెట్టుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పాకిస్థాన్ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. ఇమ్రాన్ విమానాశ్రయంలో దిగగానే.. రష్యా ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆ దేశ అధికారితో మాట్లాడుతూ.. ‘ఏం టైమింగ్‌లో వచ్చాను. చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు.. Ukraine పై మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించిన Russiaపై UK ఆంక్షలు విధించింది. రష్యాకు చెందిన విమానాలకు యూకే అనుమతిని నిరాకరించింది. దీంతో రష్యా కూడా British విమానాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. రష్యాకు చెందిన కొన్ని బ్యాంకుల లావాదేవీలపై కూడా యూకే ఆంక్షలను కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో రష్యా యూకే flightsకు తమ గగనతలంలోకి అనుమతిని నిరాకరించింది. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించడాన్ని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత రష్యన్ విమానాలపై యూకే నిషేధం విదించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా రష్యా ఈ నిర్ణయం తీసుకొంది. రష్యా పౌర విమాన శాఖ మంత్రి శుక్రవారం నాడు ఈ ప్రకటన చేశారు.