Ukraine Russia Crisis 18 ఉక్రెయిన్ యుధ్ద ట్యాంకుల ధ్వంసం: రష్యా

Published : Feb 25, 2022, 03:08 PM IST
Ukraine Russia Crisis 18 ఉక్రెయిన్ యుధ్ద ట్యాంకుల ధ్వంసం: రష్యా

సారాంశం

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతుంది. రెండు దేశాల సైనికులు హోరా హోరీగా పోరాటం చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా పట్టు బిగుస్తుంది.

కీవ్: Ukraine కు చెందిన  18 యుద్ద ట్యాంకులను ధ్వంసం చేసినట్టుగా రష్యా ప్రకటించింది. మరో వైపు Russiaకు చెందిన రెండు పారాట్రూపర్స్ ను కస్టడీలోకి తీసుకొన్నట్టుగా ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ ను తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు రష్యా బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

41 ఉక్రెయిన్ Army వాహనాలను కూడా రష్యా ధ్వంసం చేసింది. ఏడు రాకెట్ వ్యవస్థను ఐదు నౌకలను కూడా నాశనం చేసిందని స్థానిక మీడియా రిపోర్టు   చేసింది. ఇదిలా ఉంటే రష్యా దళాలకు సుమారు 150 మంది ఉక్రెయిన్ soldiers లొంగిపోయారని రష్యా  రక్షణ శాఖ ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ దాడిలో సుమారు 450 మంది రష్యాకు చెందిన ఆర్మీ చనిపోయి ఉంటారని UK అంచనా వేసింది. ఆగ్రేయ ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ ను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయని కథనాలు వస్తున్నాయి. రష్యన్లు స్వాధీనం చేసుకొన్న యుద్ధ వాహనాలు కీవ్ పట్టణానికి తరలిస్తున్నారు.

రష్యా దళాలు ఉత్తర Kviv పై దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. LPR, DPR ప్రతినిధులతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ శుక్రవారం నాడు సమావేశమయ్యారు.  ఇదిలా ఉంటే చెర్నోబిల్ ప్రాంతాన్ని రష్యా తమ ఆధీనంలోకి తీసుకొంది. అయితే చెర్నోబిల్ అణు కేంద్రానికి నష్టం వాటిల్లలేదని ఉక్రెయిన్ ప్రకటించింది.

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను గురువారం నాడు ప్రారంభించింది. కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిష్థితి గురువారం నాడు మిలటరీ ఆపరేషన్ కు దారి తీసింది. 

నాటోలో ఉక్రెయిన్ ను చేర్చుకోవద్దని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన డిమాండ్ ను పునరుద్ధాటించారు. మరో వైపు రష్యా  తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని  జెలెన్ స్కీ తెలిపారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున Kyiv లో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.  ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవతా థృక్పథంతో 20 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది. UNOసెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ విషయాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి రూ. 20 మిలియన్ డార్లను తూర్పు లుహాన్స్క్  తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తామని  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

నగరాలు, సైనిక స్థావరాలు, వైమానిక దాడుల తర్వాత  కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు  రష్యా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin సమర్ధించుకొన్నారు. 

గంట గంటకు  ఉక్రెయిన్ పై రష్యా పట్టు సాధిస్తుంది. ఉక్రెయిన్ లోని నగరాలపై  రష్యా దళాలు పట్టు సాధిస్తున్నాయి. కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీని నిరసిస్తూ రష్యాలోని పలు చోట్ల వందలాది మంది నిరసనలు సాగాయి. నిరసనలకు దిగిన వారిని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Yearender: 2025 లో భీకర పోరు.. 2026లో ఏం జరగబోతోంది?
Aliens: 2026లో గ్ర‌హాంత‌ర‌వాసులు భూమిపైకి రానున్నారా.? వైరల్ అవుతోన్న వార్తలు