
ఇస్లామాబాద్: ఈ నెల 8వ తేదీన Cabinet సమావేశం ఏర్పాటు చేసినట్టుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి Imran Khanప్రకటించారు. ఈ సమావేశంతో పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టుగా ఆయన వివరించారు. గురువారం నాడు Twitter వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం చెల్లదని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేసిన ఖాసీం సూరి ఇటీవల వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకొన్న నిర్ణయాన్ని కొట్టివేసింది.
అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చ డం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని సూచించింది.
పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోయిన ప్రధాని ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు మేరకు దేశాధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో పాక్‌లో 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. అయితే నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్ కారణంగా, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంక్వాలో 26వ సవరణ ప్రకారం సీట్ల సంఖ్య పెరిగింది. జిల్లా, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను తీసుకొచ్చారు. దీంతో ఇవన్నీ ఇప్పుడు సవాళ్లుగా మారాయి. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ నెల 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. విపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు కూడా జతకలిసిన విషయం తెలిసిందే.