మానవులతో ఏలియన్ల శృంగారం.. గర్భం దాల్చిన మహిళ? నిజమే అంటున్న డీఐఏ...

By SumaBala BukkaFirst Published Apr 8, 2022, 10:43 AM IST
Highlights

గ్రహాంతరవాసుల గురించి సినిమాల్లో, కథల్లో చదువుకోవడం కాదు.. నిజంగానే ఉన్నాయని ఆధారాలు చూపిస్తోంది డీఐఏ. అంతేకాదు కొన్ని సందర్బాల్లో ఏలియన్స్ మనుషులతో శృంగారం కూడా చేశారని.. దీనివల్ల ఓ మహిళ గర్భం కూడా దాల్చిందని చెబుతున్నారు. 

లండన్ : గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఏలియన్ స్పేస్ షిప్ (UFO)లు నిజమేనా? అంటే.. అమెరికా ప్రభుత్వానికి చెందిన  ‘
Defense Intelligence Agency (డీఐఏ)’ ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తోంది. Aliens ఉండడమే కాదు..  ఐదు సందర్భాల్లో గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటన లు కూడా నమోదయ్యాయని, ఒక మహిళ ఏలియన్స్ వల్ల గర్భం దాల్చిందని లిఖితపూర్వక నివేదిక సైతం ఇచ్చింది. ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒక చోట మనలాంటి బుద్ధిజీవులు..  మనకన్నా తెలివైన, టెక్నాలజీ పరంగా మరింత ఉన్నత స్థాయిలో ఉన్న జీవులు ఉండొచ్చని ఒక ప్రతిపాదన. ఒకవేళ వాళ్ళు  మనకన్నా తెలివైన వాళ్ళు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్లు అయితే మానవ జాతి మనుగడకే ముప్పు..  

అయితే,  కొందరు పైలెట్లు  విమానం నడుపుతున్నప్పుడు తాము యూఎఫ్ వోలను చూసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తాము ఏలియన్ లను, వారి స్పేస్ షిప్ లను చూశామని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. అడ్వాన్స్ డ్ ఏవియేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం (ఏఏటీఐపీ) పేరిట  రెండు 2007నుంచి 2012  దాకా ఒక ప్రాజెక్టును నిర్వహించింది. అంటే,  మన వద్ద ఉన్న టెక్నాలజీకి మించిన సాంకేతిక పరిజ్ఞానంతో రోదసీ నుంచి ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందేమో అని అంచనా వేసే ప్రాజెక్ట్ అన్నమాట. 

డీఐఏ  మాజీ చీఫ్ లూయిస్ ఎలిజోండో 2017లో ఈ ప్రాజెక్ట్ గురించి నోరు జారారు. దీంతో ఈ ప్రోగ్రామ్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సన్ పత్రిక  ‘ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ కింద డీఐఏని కోరింది. కానీ, వివరాలు ఇచ్చేందుకు డీఐఏ  నిరాకరించింది. ఎట్టకేలకు నాలుగేళ్ల పోరాటం తరువాత ఇటీవలే 1574 పేజీల నివేదికను సమర్పించింది. గ్రహాంతర వాసులు ఉనికిని అందులో నిర్ధారించింది. అంతే కాదు  గ్రహాంతర వాసులు మానవులతో శృంగారం జరిగిన ఘటనలు ఐదు నమోదయ్యాయని,  ఒక మహిళ గర్భం దాల్చినట్లు సాక్షులు పేర్కొన్నారని వెల్లడించింది.  

నివేదికలోని ముఖ్యాంశాలు…

గ్రహాంతర వాసుల నౌకలకు సమీపంగా వెళ్లిన విమానాల్లో ని పైలెట్లు రేడియేషన్కు గురి అయ్యారు.  మరి కొందరు  మెదడు సమస్యలు,  నాడులు దెబ్బతినడం, పక్షవాతం వంటి ఇబ్బందులకు గురయ్యారు.

- ఏలియన్స్ వల్ల ఆరోగ్య సమస్యలకు గురైన  42 కేసులు వైద్య రికార్డుల్లో నమోదయ్యాయి. రికార్డులకు ఎక్కని ఘటనలు దాదాపు 300.

- ఏలియన్స్  ప్రభావం వల్ల  కొంతమంది కాలం స్తంభించిపోయిన భావనకు గురయ్యారు. ఏలియన్స్ మానవులను అపహరించిన ఘటనలు 129 నమోదయ్యాయి.  వారి వ్యోమనౌకల వల్ల మానవుల వాహనాలు విద్యుదయస్కాంత ప్రభావానికి గురైన ఘటనలు 77 నమోదయ్యాయి. కాలాన్ని నష్టపోయామని 75 మంది చెప్పగా,  41 మందికి ఏలియన్స్ వల్ల  కాలిన గాయాలు అయ్యాయి. 23 మంది  కరెంట్ షాక్కు గురయ్యారు. 

- కాలాన్ని నష్టపోవడం అంటే, యుఎఫ్ఓలకు  దగ్గరగా వెళ్లిన విమానాల్లోని పైలెట్లకు ఐదు నిమిషాలు గడిచినట్లు అనిపించింది. కానీ తర్వాత గడియారం చూసుకుంటే అరగంట గడిచిపోయింది.  
ఏఐటీటీపీ ప్రాజెక్టులో భాగంగా గ్రహాంతరవాసుల గురించే కాక, దెయ్యాలు, భూతాలకు సంబంధించిన ఘటనలు, వాటివల్ల గాయపడిన, మరణించిన దృష్టాంతాలను నివేదికలో పేర్కొన్నది. 

click me!