ఇమ్రాన్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు.. వాటిని అమ్ముకుంటున్నాడని మండిపడ్డ ప్రతిపక్ష నేతలు

By team teluguFirst Published Oct 21, 2021, 10:50 AM IST
Highlights

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలు సంచలన  ఆరోపణలు  చేశారు. ఇమ్రాన్ చర్యలు సరిగ్గా లేవని.. ఆయన చేస్తున్నకొన్ని  పనులు తమ దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని వారు అంటున్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలు సంచలన  ఆరోపణలు  చేశారు. ఇతర దేశాల‌కు  చెందిన దేశాల అధిపతులు  ఇచ్చిన బహుమతులను  Imran Khan అమ్ముకుంటున్నారని  వారు ఆరోపిస్తున్నారు. ఓ  విలువైన బహుమతిని  తన సన్నిహితుడి ద్వారా అమ్మించిన  ఇమ్రాన్ ఖాన్ రూ. 7.4 కోట్లను తన  జేబులో వేసుకున్నాడని సోషల్  మీడియాలో  ప్రచారం సాగుతోంది. ‘ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాల నుండి అందుకున్న బహుమతులను విక్రయించారు’ అని పాకిస్తాన్  ముస్లిం లీగ్(ఎన్) ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (Maryam Nawaz) ట్వీట్ చేశారు. గిఫ్ట్ డిపాజిటరీ (తోషాఖానా) నుంచి విదేశీ బహుమతులను కొల్లగొట్టాడని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, ఇమ్రాన్ ఖాన్‌కు గల్ఫ్ దేశాలకు  చెందిన ఒక యువరాజు ద్వారా 1 మిలియన్ డాలర్ల విలువైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఖాన్ సన్నిహితుడు దుబాయ్‌లో ఆ గడియారాన్ని విక్రయించాడని.. అలా వచ్చిన 1 మిలియన్ డాలర్లు (రూ. 7.4 కోట్లు) ఇమ్రాన్‌కు అందజేశారని ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్‌ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చిన గడియారాన్ని ఆయన విక్రయించినట్లు సదరు యువరాజుకు కూడా తెలిసిందని  ప్రచారం  సాగుతుంది. 

Also read: ట్రూత్ సోషల్.. సొంత సోషల్ నెట్‌వర్క్‌పై క్లారిటీ ఇచ్చిన ట్రంప్.. అన్నంత పని చేసేశాడు..

ప్రతిపక్ష కూటమి.. పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్ (PDM) అధ్యక్షుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఒక యువరాజు నుంచి అందుకున్న విలువైన గడియారాన్ని ఇమ్రాన్ ఖాన్ విక్రయించినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇలా చేయడం  సిగ్గు చేటు అని  విమర్శించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పంజాబ్ అధ్యక్షుడు రాణా సనావుల్లా బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర దేశాల అధిపతుల అందుకున్న బహుమతులను (selling gifts received from other countries heads) విక్రయించడం ద్వారా  ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పరువు తీశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

click me!