Pakistan High Alert : భారత్ ను చూసి వణికిపోతున్న పాక్...  యుద్దభయంతో హైఅలర్ట్

Published : May 02, 2025, 10:41 AM ISTUpdated : May 02, 2025, 11:13 AM IST
Pakistan High Alert : భారత్ ను చూసి వణికిపోతున్న పాక్...  యుద్దభయంతో హైఅలర్ట్

సారాంశం

పాాకిస్థాన్ యుద్దభయంతో వణికిపోతోంది. ఇప్పటికే ఆ దేశ ఆర్మీ మనోధైర్యాన్ని కోల్పోయింది. దీంతో భారత్ సడన్ ఎటాక్ చేస్తే ఎలాగనే టెన్షన్ ఆ దేశంలో కనిపిస్తోంది. దీంతో త్రివిద దళాలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. 

Pakistan Hialert : పహల్గాం ఉగ్రదాడి  తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ భారత్ తమపై సడన్ అటాక్ చేస్తుందోనని పాక్ వణికిపోతోంది. దీంతో ముందుగానే హైఅలర్ట్ అవుతోంది... ఆర్మీని అప్రమత్తం చేసింది.  

భారత్, పాక్ సరిహద్దులో భారీగా ఆర్మీని మొహరించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ తో పాటు నావికాదళం కూడా ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నాయి... ఇందులో భాగంగానే విన్యాసాలు చేస్తున్నారు. యుద్ద ట్యాంకులు, ఆయుధాలను కూడా పాక్ సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇండియా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని పాక్ చేసుకుంటోంది.   

ఇప్పటికే పాక్ ప్రభుత్వ పెద్దలు యుద్దభయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని స్వయంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. భారత్ తో యుద్దమంటే భయపడిపోతున్న పాక్ ఆర్మీని మోటివేట్ చేసేందుకే ఆయన బార్డర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.  

భారత్ ను కవ్విస్తున్న పాక్ : 

పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థానీలే. వీరిని భారత్ పైకి ఉసిగొల్పింది పాక్ అన్న విషయం స్ఫష్టంగా తెలుస్తోంది. దీంతో పాకిస్ధాన్ పై భారత్ ఆంక్షలు విధించింది... సింధు జలాల ఒప్సందం, వీసాల రద్దు వంటి ఆంక్షలున్నాయి. అయితే పాకిస్థాన్ కూడా భారత్ పై ఆంక్షలు విధించింది. ఇలా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.  

ఈ క్రమంలో ఇండియా-పాకిస్థాన్ బార్డర్లో ఉద్రిక్తత నెలకొంది. పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. గత నాలుగైదు రోజులనుండి ప్రతిరోజు రాత్రి భారత సైనికుల శిబిరాలే టార్గెట్ గా పాక్ కాల్పులకు దిగుతోంది. భారత ఆర్మీ కూడా ఈ కాల్పులను ధీటుగానే ఎదుర్కొంటోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే