Fuel Price Hike: పాకిస్తాన్‌లో కనీవినీ ఎరుగని స్థాయికి పెట్రో ధరలు.. మినీ బడ్జెట్‌తో బాదుడే బాదుడు.. వివరాలివే

Published : Feb 16, 2023, 12:44 PM ISTUpdated : Feb 16, 2023, 12:50 PM IST
Fuel Price Hike: పాకిస్తాన్‌లో కనీవినీ ఎరుగని స్థాయికి పెట్రో ధరలు.. మినీ బడ్జెట్‌తో బాదుడే బాదుడు.. వివరాలివే

సారాంశం

పాకిస్తాన్‌లో చమురు ధరలను ఆ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. దీంతో పాక్ చరిత్రలో అత్యంత గరిష్టానికి ఇంధన ధరలు చేరాయి. ఇప్పుడు అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 272, హై స్పీడ్ డీజిల్ ధర రూ. 280.  

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగాయి. తాజాగా, ఆ దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో సామాన్యుల నడ్డి విరిచింది. పన్నులే ప్రధానంగా ఉన్న ఆ బడ్జెట్‌తో చమురు ధరలు చారిత్రక గరిష్టానికి చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం పొందడానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌కు ఆ దేశ సామాన్య ప్రజలు బలవుతున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్ ఫైనాన్స్ డివిజన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్కడ లీటర్ పెట్రోల్ పై రూ. 22.20 పెంచారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 272కు చేరింది. హైస్పీడ్ డీజిల్ పై రూ. 17.20 పెంచారు. ఫలితంగా దీని ధర లీటర్‌కు రూ. 280కి పెరిగింది. లైట్ డీజిల్ పై రూ. 9.68లతో దీని ధర లీటర్‌కు రూ. 196.68కు చేరింది. ఈ ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నట్టు జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ పెరుగుదల పాకిస్తాన్ రూపీ విలువ పతనం కావడం వల్లేనని పాకిస్తాన్ ఫైనాన్స్ డివిజన్ ఆ ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ రూపీ దారుణం పడిపోయిందని పేర్కొంది.

Also Read: కుప్పకూలిన యూఎస్ మిలిటరీ హెలికాప్టర్.. ఇద్దరు మృతి.. అలబామాలో ఘటన

ఐఎంఎఫ్ కండీషన్లకు తలొగ్గే ఈ పెంపునకు పాకిస్తాన్ పాల్పడిందని తెలుస్తున్నది. ఆర్థిక సహాయం అందించడానికి ఐఎంఎఫ్ ఈ షరతు పెట్టిందని సమాచారం. ఈ పెంపుతో ఇప్పటికే రికార్డ్ హై లో ఉన్న ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ తర్వాత పాకిస్తాన్ ద్రవ్యోల్బణం మరింత పైకి పోయే అవకాశం ఉన్నది.

మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన సీనియర్ ఎకనామిస్ట్ కాత్రినా ఎల్ దీనిపై మాట్లాడారు. 2023 ప్రథమార్థంలో దేశ ద్రవ్యోల్బణం సగటున 33 శాతం ఉండొచ్చని వివరించారు. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కేవలం ఐఎంఎఫ్ ద్వారా మాత్రమే గాడిన పడదని స్పష్టం చేశారు. 

ఈ మినీ బడ్జెట్ ద్వారా పన్నులు విపరీతంగా పెంచారు. ట్యాక్స్ కలెక్షన్ నెట్‌ను విస్తరించి బడ్జెట్‌లో ద్రవ్యలోటును తగ్గించాలని పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అర్థం అవుతున్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !