
ఆఫ్గానిస్థాన్ తాలిబాన్ల నుంచి స్పూర్తి పొందారో ఏమో కానీ పక్క దేశం పాకిస్థాన్‌కు అంటుకుందా? ఆఫ్గాన్‌లో ప్రజలు తాము చెప్పిందే చేయాలని.. లేదంటే కాల్చిపారేస్తామని పీకమీద కత్తి పెట్టి.. నుదుటిన గన్‌లు పెట్టి మరీ అరాచకాలు చేస్తున్న తాలిబన్ల అరాచకత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి కూడా అంటున్నట్లుగా ఉంది. పాక్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది.
ఉపాధ్యాయులు ఎలా ఉండాలో..ఎటువంటి బట్టలు వేసుకోవాలో..ఎటువంటి బట్టలు వేసుకోకూడదు ? అని విషయంపై ఓ డిక్రీ జారీ చేసింది.ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద స్కూలు, కాలేజీలు, యూనివర్శిటీలలో ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని ఇది పేర్కొంది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇవి ధరించకూడదని వారి కచ్చితంగా సంప్రదాయ దుస్తులే ధరించాలని హుకుం జారీ చేసింది.
ఇమ్రాన్ ప్రభుత్వ కొత్త కోడ్ ఎఫ్‌డీఈ ద్వారా సెప్టెంబర్ 7న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో పాకిస్తాన్ ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిశోధన సమయంలో ప్రజల మనస్సుపై దుస్తులు చూపిస్తున్న ప్రభావం ఎక్కువుందని తేలింది. ఈ అభిప్రాయం విద్యార్థులపై మాత్రమే ఉంది. ఉపాధ్యాయులు ధరిస్తున్న దుస్తుల ప్రభావం విద్యార్ధుల మీద పడుతుందనేది స్పష్టం అయింది. అందుకే.. మహిళా ఉపాధ్యాయులు ఇప్పటి నుండి జీన్స్ లేదా టైట్స్ ధరించకూడదని మేము నిర్ణయించుకున్నాము. పురుష ఉపాధ్యాయులు కూడా జీన్స్, టీ షర్టులు ధరించకుండా ఉండాల్సిందే. అదే విధంగా వారు క్లాస్, ల్యాబ్‌లలో టీచింగ్ గౌన్‌లు లేదా కోట్లు ధరించాల్సి ఉంటుంది.