పాకిస్తాన్ వక్రబుద్ధి: సిమ్లా ఒప్పందానికి తూట్లు, సంఝౌతా ఎక్స్ ప్రెస్ నిలిపివేత

By Nagaraju penumalaFirst Published Aug 8, 2019, 2:53 PM IST
Highlights

తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పాక్ నిలిపివేసినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది. 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. 

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం తన దుర్బుద్ధిని చూపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజనలను తీవ్రంగా వ్యతిరేకించిన పాకిస్తాన్ ఆనాటి నుంచి ఏదో ఒక విధంగా భారత్ పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. 

తాజాగా ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును పాకిస్తాన్ నిలిపివేసింది. 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడిచింది. పాక్ చర్యలపై అమెరికా సైతం అసహనం వ్యక్తం చేసింది.

జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ వివాదమని ఆర్టికల్ ను ద్దు చేయడం సరికాదంటూ పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. భాగస్వామిగా ఉన్న తమను సంప్రదించకపోవడంపై మండిపడుతోంది. జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దులను భారత్ లోని ఉభయ సభలు ఆమోదం తెలపడంతో ఇక చట్టం కాబోతుంది. 

ఈ తరుణంలో పాకిస్తాన్ కావాలనే కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే జమ్ముకశ్మీర్ వ్యవహారం తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసినప్పటికీ పాక్ మాత్రం ససేమిరా అంటోంది. భారత్ వైఖరిని తప్పుబడుతోంది.  

పాకిస్తాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భారత్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుండటంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చిర్రెత్తుకొచ్చినట్లైంది. బుధవారం సాయంత్రం జరిగిన పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహా మండలి సమావేశంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

అంతేకాదు ఆ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. పాకిస్థాన్‌ హై కమిషనర్‌ను భారత్‌కు పంపరాదని నిర్ణయించింది. తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పాక్ నిలిపివేసినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది. 

1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్‌కు రాకపోకలు సాగించే ఈ ట్రైన్ సర్వీసును ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ నిలిపివేసినట్లు తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి 

కశ్మీర్ అంశంపై స్పందించిన మలాలా.. ఆర్టికల్ 370 అనే పదం లేకుండా..

పాక్ కు అగ్రరాజ్యం మెుట్టికాయలు: దూకుడు తగ్గించాలని అమెరికా వార్నింగ్

click me!