కశ్మీర్ అంశంపై స్పందించిన మలాలా.. ఆర్టికల్ 370 అనే పదం లేకుండా..

By telugu teamFirst Published Aug 8, 2019, 1:18 PM IST
Highlights

ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా తొలిసారి స్పందించిన మలాలా.. కశ్మీర్ లోని మహిళలు, చిన్నారుల రక్షణ గురించి ఆవేదన వ్యక్తం చేసింది. తాను  చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి.. తన తల్లిదండ్రులు చిన్న పిల్లలుగా ఉన్ననాటి నుంచి.. తన తాత ముత్తాతలు వయసులో ఉన్నప్పటి నుంచి కశ్మీర్ లో సంక్షోభం ఉందని ఆమె అన్నారు.

నోబెల్ బహుమతి గ్రహీత, పాకిస్థాన్ యాక్టివిస్ట్ మలాలా యూసుఫ్ జాయ్ స్పందించారు.  ఇటీవల భారత ప్రభుత్వం కశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370 ని తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రెండు భాగాలుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేశారు.  కాగా... ఈ అంశంపై ఇప్పటికే చాలా స్పందించారు. కొందరు మద్దతుగా నిలస్తే.. మరికొందరు వ్యతిరేకించారు.

ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా తొలిసారి స్పందించిన మలాలా.. కశ్మీర్ లోని మహిళలు, చిన్నారుల రక్షణ గురించి ఆవేదన వ్యక్తం చేసింది. తాను  చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి.. తన తల్లిదండ్రులు చిన్న పిల్లలుగా ఉన్ననాటి నుంచి.. తన తాత ముత్తాతలు వయసులో ఉన్నప్పటి నుంచి కశ్మీర్ లో సంక్షోభం ఉందని ఆమె అన్నారు.

అప్పటి నుంచి కాశ్మీర్ లో మహిళలు, చిన్నారులు నరకం అనుభవిస్తున్నారని ఆమె చెప్పారు. కాగా... వీరి బాధ్యతను దక్షిణాసియా దేశాలు చూసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. తనకు కాశ్మీర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు. ఎందుకంటే దక్షిణాసియా తనకు సొంత ఇల్లు లాంటిదన్నారు. 

అందుకే అక్కడి ప్రజల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దక్షిణాసియాలో 1.8 బిలియన్ ప్రజలు నివసిస్తున్నారని... వారిలో భిన్నజాతులు, భిన్నమైన సంప్రదాయాలు, భాషలు, ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ దక్షిణాసియాకి చెందినవారమేనని అన్నారు. నిత్యం హింసతో బ్రతకాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే తాను కాశ్మీర్ లోని మహిళలు,  చిన్నారుల రక్షణ గురించి ఆవేదనకు గురౌతున్నట్లు చెప్పారు. ఈ బాధ్యతను అధికారలు తీసుకోవాలని చెప్పారు. 

ఇదిలా ఉంటే... తన ట్వీట్ లో మలాలా ఎక్కడా కనీసం ఆర్టికల్ 370 అనే పదాన్ని కూడా వాడలేదు. దానికి తాను మద్దతు ఇస్తున్నట్లు కానీ... ఇవ్వనట్లు కానీ ఏమీ ప్రకటించలేదు. కేవలం మహిళలు, చిన్నారుల రక్షణ గురించి మాత్రమే స్పందించడం గమనార్హం. 

click me!