వంకర బుద్ధి: జైషే మొహమ్మద్ ను వెనకేసుకొచ్చిన పాక్

By telugu teamFirst Published Mar 2, 2019, 10:44 AM IST
Highlights

పుల్వామా దాడితో ఆ సంస్థకు సంబంధం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షథా మహమూద్ ఖురేషీ అన్నారు. దాడి జరిగిన వెంటనే తామే ఆ పనిచేశామని జైష్ ఎ మొహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. పుల్వామా దాడి ఘటనపై జైష్ - ఎ- మొహమ్మద్ ను పాకిస్తాన్ వెనకేసుకొచ్చింది. పుల్వామా దాడితో ఆ సంస్థకు సంబంధం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షథా మహమూద్ ఖురేషీ అన్నారు. 

దాడి జరిగిన వెంటనే తామే ఆ పనిచేశామని జైష్ ఎ మొహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ మాట భారత్ విని ఉంటే ఇరు దేశాల మధ్య సంక్షోభం నెలకొని ఉండేది కాదని ఆయన బీబీసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ సాక్ష్యాలు ఇస్తే ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

పుల్వామా దాడిని తామే చేశామని జైషే మొహమ్మద్ చెప్పుకోలేదని ఆయన అన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ఆహ్వానించడంతో ఖురేషీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతృత్వంలో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసి) సమావేశానికి హాజరు కాలేదు. పాకిస్తాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఓఐసి సమావేశానికి సుష్మా స్వరాజ్ ను ఆహ్వానించారు. 

పాకిస్తాన్ చేతికి చిక్కిన అభినవ్ వర్థమాన్ రాక కోసం భారతదేశమంతా నిరీక్షిస్తున్న సమయంలో శుక్రవారం ఖురేషీ బీబీసికి ఇంటర్వ్యూ ఇచ్చారు.  

click me!