భారత్ కి అభినందన్.. ఇమ్రాన్ ఖాన్ కి నోబెల్ డిమాండ్

Published : Mar 01, 2019, 03:14 PM IST
భారత్ కి అభినందన్.. ఇమ్రాన్ ఖాన్ కి నోబెల్ డిమాండ్

సారాంశం

పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ మరికొద్ది సేపట్లో స్వదేశానికి చేరుకోనున్నారు.


పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ మరికొద్ది సేపట్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఇప్పటికే అతనిని పాక్.. భారత రాయబారికి అప్పగించారు. కాగా.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాక్ లో ఓ ఆసక్తికర టాపిక్ నడుస్తోంది.

బుధవారం మిగ్ 21 యుద్ధవిమానం పాక్ సరిహద్దులో కూలిపోవడంతో.. పైలట్ అభినందన్‌ను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులను నియంత్రించి...అభినందన్ ని వెనక్కి పంపేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు.  ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన లక్ష్యంగా ఇమ్రాన్ దిగి వచ్చారు.

కాగా అభినందన్ భారత్‌కు తిరిగొస్తున్న తరుణంలో పాక్ సోషల్ మీడియాలో వింత వాదన ఒకటి తెరపైకి వచ్చింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ‘నోబెల్ శాంతి పురస్కారం’ ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది. ఆ దేశ ట్విటర్‌లో ఇదే అంశం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ‘#NobelPeacePrizeForImranKhan’ పేరిట తమ డిమాండ్లను పాక్ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !