పీరియడ్స్ వస్తే.. మైనర్ అయినా పెళ్లి కి ఒకే .. కోర్టు షాకింగ్ తీర్పు

By telugu teamFirst Published Feb 8, 2020, 2:42 PM IST
Highlights

బాలికకు మైనార్టీ తీరకున్నా.. మెచ్యూర్( రుతు క్రమం) అయ్యింది కాబట్టి.. ఎత్తుకెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చెల్లుతుందని కోర్టు చెప్పడం విశేషం. షారియా చట్టం ప్రకారం.. బాలికకు ఒక్క నెల పీరియడ్స్ వచ్చినా చాలని.. ఆ పెళ్లి చెల్లుతుందని చెప్పడం విశేషం.

మైనారిటీ తీరకుండా పెళ్లిళ్లు చేయడం చాలా నేరం. అందులోనూ బలవంతంగా ఎత్తుకెళ్లి మతం మార్చి మరీ పెళ్లి చేసుకోవడం మరింత పెద్ద తప్పు. అయితే... అలాంటి తప్పులను కోర్టు సమర్థించడం గమనార్హం. ఈ దారుణ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ కి చెందిన హుమా(14) తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.  క్రిష్టియన్ మతానికి చెందిన ఈ బాలికను గతేడాది అక్టోబర్ లో అబ్దుల్ జబ్బర్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. బలవంతంగా బాలికను ఎత్తుకెళ్లి ఆమెను ఇస్లాం మతంలోకి మార్చేశాడు. అనంతరం ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు.

Also Read అత్యాచారానికి పాల్పడితే బహిరంగ ఉరి.. పార్లమెంట్లో సంచలన బిల్లు...

ఆ బాలిక కనీసం ఆమె తల్లిదండ్రుల వద్దకు కూడా వెళ్లనివ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో... బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించాలని.. బాలికకు మైనార్టీ కూడా తీరలేదేని.. ఆ పెళ్లి చెల్లదంటూ కోర్టును ఆశ్రయించారు.  ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం షాకింగ్ తీర్పు ఇచ్చింది.

బాలికకు మైనార్టీ తీరకున్నా.. మెచ్యూర్( రుతు క్రమం) అయ్యింది కాబట్టి.. ఎత్తుకెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చెల్లుతుందని కోర్టు చెప్పడం విశేషం. షారియా చట్టం ప్రకారం.. బాలికకు ఒక్క నెల పీరియడ్స్ వచ్చినా చాలని.. ఆ పెళ్లి చెల్లుతుందని చెప్పడం విశేషం. సింధ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు విని బాలిక తల్లిదండ్రులు షాకయయ్యారు. 

దీంతో.. బాలిక తల్లిదండ్రులు ఈసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేుసు సుప్రీం కోర్టులో ఉంది. కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు తమ కుమార్తెను కనీసం ఏదైనా మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. అంతేకాకుండా.. బాలిక వయసుకి సంబంధించిన ఆధారాలను కూడా వారు కోర్టులో సమర్పించారు. 

కనీసం 18 సంవత్సరాలు దాటకుండా బాలికలకు పెళ్లిళ్లు చేయడం నేరం. దీంతో.. బాలికకు ఇంకా మైనార్టీ తీరలేదని వారు కోర్టులో ఆధారాలు అందరజేశారు.  కోర్టు కూడా బాలిక వయసుకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు.  కాగా..  దీనికి సంబంధించి తీర్పు ఇంకా వెలువడలేదు. అయితే.. తమ కూతురిని తమకు అప్పగించాలని.. మాకు న్యాయం చేయాలని హుమా తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇతర మతాలవారు కూడా తమకు మద్దతుగా నిలవాలని వారు వేడుకుంటున్నారు.

click me!