పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 63 కి చేరిన  మృతుల సంఖ్య, 150 మందికి గాయాలు 

By Rajesh KarampooriFirst Published Jan 31, 2023, 5:19 AM IST
Highlights

పాకిస్థాన్ లోని పెషావర్‌లో పేలుడు సంభవించింది. జుహర్ ప్రార్థన తర్వాత ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు, ఇప్పటివరకు 63 మంది మరణించారు.150 మంది గాయపడ్డారు.  

పాకిస్థాన్ లో భారీ పేలుడు: పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని పోలీస్ లైన్ మసీదులో భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్ జాతీయ వార్తాపత్రికల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని పోలీస్ లైన్ ప్రాంతంలో ఉన్న మసీదులో ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. జుహర్ ప్రార్థనల అనంతరం ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో 63 మంది మృతి చెందగా, 150 మంది గాయపడ్డారు. 

మీడియా కథనాల ప్రకారం.. పెషావర్‌లోని పోలీస్ లైన్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఒక మసీదులో జరిగింది. ఈ ఘటనలో దాదాపు 150 మంది గాయపడ్డారు. అదే సమయంలో 63 మంది మరణించారు. పేలుడు చాలా తీవ్రత ఉందనీ, భవనంలో కొంత భాగం కూలిపోయిందని, చాలా మంది ప్రజలు దాని కింద చిక్కుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

లేడీ రీడింగ్ హాస్పిటల్ (ఎల్‌ఆర్‌సి) ప్రతినిధి మహ్మద్ అసిమ్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. ఘటన ప్రాంతాన్ని పూర్తిగా సీలు చేశామని, అంబులెన్స్‌లను మాత్రమే ఆ ప్రాంతంలోకి అనుమతిస్తున్నామని అసీమ్ పాక్ వార్తాపత్రిక డాన్‌తో చెప్పారు.
 
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా  పోరాడాలి- షాబాజ్‌ షరీఫ్‌

అదే సమయంలో పెషావర్ పేలుడు ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటన వెనుక దాడికి పాల్పడిన వారికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పాకిస్థాన్‌ను రక్షించేందుకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భయాందోళనలు సృష్టించాలనుకుంటున్నారని అన్నారు. దాడిలో మరణించిన వారి ప్రాణాలు వృధా కాబోవని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై నిలబడిందని ప్రధాని అన్నారు.

 
అదే సమయంలో, ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని ఖండించారు. బాధిత కుటుంబాలకు కూడా సానుభూతి తెలిపారు. పెషావర్‌లోని పోలీస్‌ లైన్‌ మసీదులో జుహర్‌ ప్రార్థనల సందర్భంగా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని ఖండిస్తున్నట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. బాధిత కుటుంబాలకు నా ప్రార్థనలు మరియు సానుభూతి. పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి మన గూఢచార సేకరణను మెరుగుపరచడం , మా పోలీసు బలగాలను సరిగ్గా సన్నద్ధం చేయడం అత్యవసరమని తెలిపారు. 


గతేడాది కూడా షియా మసీదులో పేలుడు జరిగింది. మధ్యాహ్నం 1:40 గంటలకు జుహర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. పెషావర్‌లోని కొచా రిసల్దార్ ప్రాంతంలోని షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 63 మంది మృతి చెందినప్పుడు, గత ఏడాది కూడా పెషావర్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.

click me!