ఎన్నో అవమానాలు.. భారీ మూల్యం చెల్లించాం: అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 19, 2021, 3:54 PM IST
Highlights

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు. అమెరికాపై నిందలు వచ్చిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతారని ఇటీవల అమెరికా సెనేట్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ విచారణలో చాలా మంది అధికారులు పాక్‌ను నిందించారు.
 

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు. దీనికి తోడు అవమానకర రీతిలో అమెరికన్లు అఫ్గానిస్థాన్‌ను వీడటానికి కూడా ఇస్లామాబాదే కారణమని నిందిస్తున్నట్లు ఆయన మండిపడ్డారు. ‘రష్యా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధికారులపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై నిందలు వచ్చిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతారని ఇటీవల అమెరికా సెనేట్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ విచారణలో చాలా మంది అధికారులు పాక్‌ను నిందించారు. తాలిబన్లకు వారే ఆశ్రయమిచ్చారని ఇమ్రాన్ ఆరోపించారు.

ఆ సెనేటర్లు చేసిన ఆరోపణలు విని ఒక పాకిస్థానీగా నేను చాలా బాధపడుతున్నాని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లోని వైఫల్యానికి పాకిస్థాన్‌ని నిందించడం చాలా బాధాకరం అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. అమెరికాపై 9/11 దాడి జరిగిన సమయంలో పాకిస్థాన్‌లో రాజకీయ సుస్థిరత లేదు. అప్పుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సైనిక తిరుబాటు చేసి అధికారంలోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు. అధికారం నిలపుకొనేందుకు తనకు అమెరికా మద్దతు అవసరమన్నారు.

ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో అమెరికా యుద్ధానికి పాకిస్థాన్‌ మద్దతు పలికిందని ఇమ్రాన్ చెప్పారు. ఇది ఒక తప్పుడు నిర్ణయమని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటికీ భావిస్తున్నారు. విదేశీ ఆక్రమణల నుంచి రక్షించుకునేలా వారికి శిక్షణ ఇచ్చామని.. అది పవిత్ర యుద్ధమని ఇమ్రాన్ చెప్పారు. కానీ, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడితే అది ఉగ్రవాదం అవుతుందని వారికి చెప్పామని పాక్ ప్రధాని తెలిపారు. 

click me!