61 ఏళ్ల వ్యక్తితో 19 ఏళ్ల యువతి లవ్, పెళ్లి: యువతి పేరేంట్స్ ఏం చేశారంటే?

By narsimha lodeFirst Published Sep 19, 2021, 11:00 AM IST
Highlights


19 ఏళ్ల యువతి 61 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొంది. తొలుత ఈ పెళ్లికి యువతి పేరేంట్స్ అంగీకరించలేదు. పోలీసులను పిలిచి  నానా హంగామా చేశారు. ఈ జంట పెళ్లి చేసుకొన్న తర్వాత ఈ పెళ్లిని స్వాగతించారు.

వాషింగ్టన్: అమెరికాకు చెందిన 19 ఏళ్ల యువతి 61 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకొంది.ఈ విషయమై  తొలుత యువతి కుటుంబసభ్యులు అభ్యంతర పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే చివరికి ఈ పెళ్లికి యువతి ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించారు.ఈ విషయమై ఆ యువతి తన ప్రేమ కథను మీడియాకు వివరించింది.

తమ మధ్య 42 ఏళ్ల వయస్సు తేడా ఉందని గుర్తించి తమ పేరేంట్స్ అంగీకరించకుండా అవమానపర్చారని ఆమె చెప్పారు. అయితే తాము ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకొన్న తర్వాత తమ పెళ్లిని తమ పేరేంట్స్ అంగీకరించారని ఆమె తెలిపారు.తొలుత తన ప్రియుడిని ఇంట్లోని వారికి పరిచయం చేసేందుకు తీసుకువెళ్లినపుడు కుటుంబ సభ్యులు తమను చూడగానే పోలీసులను పిలిచి నానా హంగామా చేశారన్నాని ఆమె గుర్తు చేసుకొన్నారు.

ఆ తరువాత తాము వివాహం చేసుకున్నామని ఆమె తెలిపారు. తన ప్రియుడు ఇద్దరు పిల్లల తండ్రి అని కూడా తనకు తెలుసన్నారు. అయితే తాము వివాహం చేసుకున్న తరువాత తన ఇంటిలోని వారు తమను ఘనంగా స్వాగతించారన్నారు. కాగా ఈ దంపతుల మధ్య 42 ఏళ్ల వయసు తేడా ఉంది. 

19 ఏళ్ల స్మయిలీ మూన్ 2020లో పోలీసు అధికారి కెవిన్(61)ను కలుసుకుంది. ఉద్యోగంలో అతని సీనియాటీని చూసి మూన్ అతనికి ఆకర్షితురాలైంది. పరిచయమైన కొద్ది కాలానికే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత వీరిద్దరూ తమ మధ్యగల అన్ని విషయాలను చర్చించుకున్నారు. కెవిన్ ఎంతో అందగాడని, తమ మధ్య పెనవేసుకున్న ప్రేమ బంధం మరింత దగ్గర చేసిందని స్మయిలీ మూన్ చెప్పారు. కాగా కెవిన్‌కు అప్పటికే వివాహం కాగా, అతనికి 16-23 ఏళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

click me!