Pakistan: ఓ పక్క ఆపరేషన్ సింధూర్..మరోపక్క బలూచ్ దాడులు..ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్

Published : May 08, 2025, 02:00 PM IST
Pakistan:  ఓ పక్క ఆపరేషన్ సింధూర్..మరోపక్క బలూచ్ దాడులు..ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్

సారాంశం

భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, బలూచ్ తిరుగుబాటుతో పాక్ కుదేలవుతోంది. పాకిస్తాన్‌ ఆర్మీపై వరుసగా దాడులు జరిగాయి.

భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ వల్ల పాకిస్తాన్‌లో కలకలం సృష్టించింది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల మరణం భారత్‌ను కలిచివేసింది. దానికి ప్రతిగా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ధాటి నిర్వహించింది. ఈ దాడులతో పాకిస్తాన్‌ సైన్యం నిశ్చేష్టంగా మారింది.

ఈ పరిణామాల మధ్య బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ ఇచ్చింది. గురువారం బలూచిస్థాన్‌లోని బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లకు BLA బాధ్యత వహించింది. మొదటి ఘటన బోలాన్‌లో మాచ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. షోర్కాండ్‌లో పాక్ సైనిక కాన్వాయ్‌పై రిమోట్ కంట్రోల్డ్ IED పేలుడు జరిగింది. ఈ దాడిలో 12 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారు. ఈ దాడిలో సైనిక వాహనం పూర్తిగా నాశనమైంది.

రెండవ ఘటన కెచ్ జిల్లా కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2:40 గంటల సమయంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను లక్ష్యంగా చేసుకుని మరో రిమోట్ కంట్రోల్డ్ పేలుడు జరిగింది. ఈ సంఘటనలో మరో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు.ఇప్పటికే పాకిస్తాన్‌ బలూచిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేయడానికి యత్నిస్తోంది. అక్కడి ప్రజలు స్వతంత్ర దేశం కావాలని పయనిస్తున్న వేళ, ఈ విధంగా బలూచ్ గ్రూపులు పాక్ ఆర్మీపై దాడులకు తెగబడుతున్నాయి.ఇటీవల భారత్‌ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌ దిక్కుతెలియని స్థితిలో ఉంది. మరోవైపు బలూచ్ కార్యకలాపాలు పాక్‌ను ఇంకొంతగా అశాంతికి గురిచేస్తున్నాయి. ఇలా రెండు వైపులా ఒత్తిడిలో పడ్డ పాకిస్తాన్‌కు ఇప్పుడు శాంతిని కోరితే ఉగ్రవాద మద్దతును ఆపాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే బలూచిస్థాన్‌ అంశంపై కూడా కొత్త దిశలో ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే