9/11 తరహ దాడుల నుండి రక్షిస్తారు: ట్రంప్‌కి లాడెన్ కోడలు మద్దతు

Published : Sep 07, 2020, 10:11 PM IST
9/11 తరహ దాడుల నుండి రక్షిస్తారు: ట్రంప్‌కి లాడెన్ కోడలు మద్దతు

సారాంశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు నూర్ బిన్ లాడెన్ మద్దతు ప్రకటించారు.ఉగ్రవాద కార్యకలాపాల నుండి ట్రంప్ ఒక్కరే అమెరికాను కాపాడనున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించాలని ఆమె కోరారు. 


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు నూర్ బిన్ లాడెన్ మద్దతు ప్రకటించారు.ఉగ్రవాద కార్యకలాపాల నుండి ట్రంప్ ఒక్కరే అమెరికాను కాపాడనున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించాలని ఆమె కోరారు. 

న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్ ఈ మేరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె కుండబద్దలు కొట్టారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ప్రమాదమని ఆమె చెప్పారు. ట్రంప్ గెలిస్తేనే 9/11 తరహా దాడులు జరగకుండా అడ్డుకోగలరని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడుగా ఒబామా, వైస్ ప్రెసిడెంంట్ గా బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో  పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ విస్తరించిందని చెప్పారు. 
వామపక్షవాదులు ఎప్పుడూ రాడికలింజంతో పొత్తు పెట్టుకొన్నారని నూర్ ఆరోపించారు.

ఉగ్రవాదులను నిర్మూలించడం ద్వారా అమెరికాను భయంకరమైన ఉగ్ర దాడుల నుండి కాపాడారని నూర్ అభిప్రాయపడ్డారు.ట్రంప్ ను మరోసారి ఎన్నుకోవాలని ఆమె ప్రజలను కోరారు. 

PREV
click me!

Recommended Stories

Most Dangerous Lake : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు.. దిగితే ప్రాణాలు పోవడం ఖాయం!
World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !