ఇంగ్లాండ్‌లో కత్తి పోట్ల కలకలం: ప్రజలపై విచక్షణారహితంగా దాడి

Siva Kodati |  
Published : Sep 06, 2020, 06:47 PM IST
ఇంగ్లాండ్‌లో కత్తి పోట్ల కలకలం: ప్రజలపై విచక్షణారహితంగా దాడి

సారాంశం

ఇంగ్లాండ్‌లో వరుస కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్‌ ప్రాంతంలో దుండగులు అక్కడేవున్న స్థానికులపై విచక్షణారహితంగా కత్తిపోట్లకు పాల్పడినట్లు వెస్ట్‌ మిడ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు.

దుండగులు వరుసగా చాలామందిపై కత్తులతో దాడులకు పాల్పడి గాయపరిచినట్లు గుర్తించారు. అయితే ఈ దాడులకు గల కారణాలు మాత్రం తెలియాల్సి వుంది. గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

వీరిలో ఎంతమందికి ప్రాణాపాయం ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. కానీ దీనిని అతిపెద్ద ఘటనగానే బర్మింగ్‌హామ్ పోలీసులు ప్రకటించారు. ఇదే సమయంలో దాడులకు దారి తీసిన కారణాలపై అన్వేషించే పనిలో పడ్డారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని రోడ్లన్నీ మూసివేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రశాంతతకు మారు పేరైనన ఈ నగరంలో ఎప్పుడైనా ఒకసారి స్వల్ప ఘర్షణలు జరిగినప్పటికీ, ఈ తరహా సంఘటన మాత్రం ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Most Dangerous Lake : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు.. దిగితే ప్రాణాలు పోవడం ఖాయం!
World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !