వెన్నులో వణుకు పుట్టించే రోడ్డు ప్రమాదం ఇది..!

By telugu news teamFirst Published Jun 7, 2023, 10:34 AM IST
Highlights

ఇదంతా సమీపంలోని సీసీకెమేరాలో రికార్డు కాగా, వీడియో వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియో గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ప్రమాదం నాటిదట.

ప్రమాదం ఎప్పుడు, ఎలా పొంచి ఉంటుందో ఎవరూ చెప్పలేరు.  మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటివారు సరిగా లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల యూకేలో ఓ రోడ్డు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే, ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టేస్తుంది. 

ఓ ట్రాక్టర్ హేవీ లోడ్ తో వస్తుండగా, అదుపు తప్పింది. దీంతో.. ఎదురుగా వస్తున్న కారను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఇదంతా సమీపంలోని సీసీకెమేరాలో రికార్డు కాగా, వీడియో వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియో గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ప్రమాదం నాటిదట.

ట్రాక్టర్ నడిపింది ఓ 19ఏళ్ల యువకుడు కావడం గమనార్హం. ట్రాక్టర్ వెకన లోడ్ కూడా పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు.  ఈ ఘటనలో కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడటం విశేషం. అతను ప్రమాదాన్ని ముందే గుర్తించి కారులో నుంచి దిగినట్లు తెలుస్తోంి. లేదంటే అతను ప్రాణాలతో మిగిలేవాడు కాదు.

 

కాగా, అనుమతి లేకుండా, నిర్లక్ష్యంగా డ్రైవింగ చేసిన యువకుడికి న్యాయస్థానం 8వారాల జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా,  కార్లిస్లే మేజిస్ట్రేట్ కోర్టులో 60 గంటల జీతం లేని పనిని విధించారు. ఆ కారు డ్రైవర్ చాలా తెలివిగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ లేకపోయింటే చాలా దారుణం జరిగి ఉండేదని అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ట్రాక్టర్ నడిపిన యువకుడు డ్రగ్స్ తీసుకున్నాడని, ఆ మత్తులోనే కంట్రోల్ కోల్పోయి.. ఇలా డ్రైవ్ చేశాడని కోర్టులో నిర్థారణ అయ్యింది. నిందితుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించడం గమనార్హం. 

click me!