వర్జీనియాలో కాల్పులు కలకలం.. హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తరువాత కాల్పులు.. ఇద్దరు మృతి, 5గురికి గాయాలు..

By SumaBala BukkaFirst Published Jun 7, 2023, 8:34 AM IST
Highlights

మంగళవారం సాయంత్రం హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత వర్జీనియాలోని రిచ్‌మండ్‌లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  ఇద్దరు మృతి చెందగా, 5గురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

వర్జీనియా : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియా రాష్ట్రంలో ఓ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక జరిగిన థియేటర్ వెలుపల మంగళవారం సాయంత్రం ఏడుగురిపై కాల్పులు జరిగాయి. వీరిలో ముగ్గురికి ప్రాణాంతక గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మృతి చెందారు. ఈ వివరాలను రిచ్‌మండ్ తాత్కాలిక పోలీసు చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ తెలిపారని మీడియా కథనం. ఈ కాల్పులకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎడ్వర్డ్స్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత వర్జీనియాలోని రిచ్‌మండ్‌లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరగడంతో పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. రిచ్‌మండ్ పోలీసు ప్రతినిధి ట్రేసీ వాకర్ వీటిని ధృవీకరించారు. ప్రజలకు తక్షణ ముప్పు లేదని చెప్పారు.

హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు రిచ్‌మండ్ పబ్లిక్ స్కూల్స్ అధికారి మాథ్యూ స్టాన్లీ తెలిపారు. ఈ పార్క్ వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ క్యాంపస్‌లో, థియేటర్‌కి ఎదురుగా ఉందని తెలుస్తోంది. 

ర‌ష్యా-ఉక్రెయిన్ వార్: కూలిన కఖోవ్కా ఆనకట్ట.. పొటెత్తిన వ‌ర‌ద‌లు.. నీట‌మునిగిన ర‌ష్యా ఆధీన న‌గ‌రం

" ఈ సాయంత్రం కాల్పుల ఘటన వల్ల.. అదే ప్రాంతంలో జరగాల్సి ఉన్న మరో స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకను రద్దు చేసాం" అని స్టాన్లీ చెప్పారు.

పాఠశాల సిస్టమ్ వెబ్‌సైట్ ప్రకారం, మూడు పాఠశాలలకు చెందిన గ్రాడ్యుయేషన్ వేడుకలు మంగళవారం ఆల్ట్రియా థియేటర్‌లో జరగాలని షెడ్యూల్ చేయబడ్డాయి. దీంతో మిగతా వేడుకలను రద్దు చేస్తూ సాయంత్రం 5:15 గంటలకు అలర్ట్ పంపబడింది. మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ తెలిపింది. కాల్పులు జరిగిన దాదాపు గంట తర్వాత... ఇక ఎటువంటి ముప్పు లేదని అలర్ట్ పేజ్ లో తెలిపింది.

రిచ్‌మండ్ మేయర్ లెవర్ ఎం. స్టోనీ ఈ పరిస్థితిపై ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.. అందులో  "ప్రస్తుతం మన్రో పార్క్ వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ఆర్పిడీ, ఆర్పీఎస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. సమాచారం వచ్చింది వచ్చినట్టుగా అందుబాటులో ఉంచుతాం. దయచేసి ఆ పరిసరాలకు దూరంగా ఉండండి" అని స్టోనీ ట్వీట్ చేశారు. 

click me!