Omicron variant : ఒమిక్రాన్‌లో డేంజరస్ మ్యుటేషన్స్.. అది గమనాన్నే మార్చొచ్చు : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

By Rajesh K  |  First Published Dec 9, 2021, 7:55 PM IST

Omicron variant : ఒమిక్రాన్ వేరియంట్ నుంచి తీవ్ర స్థాయిలో ముప్పు పొంచి ఉందని WHO హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు అత్య‌ధిక రోగనిరోధకవ్యవస్థ ఉంద‌నీ, త‌ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కేసులు పెరిగే అవకాశముందని తెలిపింది. అదే జ‌రిగితే.. తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. 
 


Omicron virus: కరోనా  మ‌హ‌మ్మారి  విజృంభన త‌గ్గుముఖం పడుతోన్న నేప‌థ్యంలో మరో కొత్త వైరస్ బ‌య‌ట‌ప‌డి.. ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. చాపకింద నీరులా ప్ర‌పంచ దేశాల‌కు వ్యాపిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. 

ఈ క్ర‌మంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఒమిక్రాన్ వేరియంట్  నుంచి తీవ్ర స్థాయిలో ముప్పు పొంచి ఉందని WHO హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు అత్య‌ధిక రోగనిరోధకవ్యవస్థ ఉంద‌నీ, త‌ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున కేసులు పెరిగే అవకాశముందని తెలిపింది. అదే జ‌రిగితే.. తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. 

Latest Videos

undefined

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/omicron-tension-in-srikakulam-district-after-south-africa-returnee-tests-positive-for-covid-r3s4sk

సాధ్య‌మ‌నంత త్వ‌ర‌గా వ్యాక్సినేషన్ ను పూర్తి  చేయాల‌ని, ప్రజలను రక్షించుకునేందుకు కట్టడి చర్యలను పాటించాలని ప్ర‌పంచ దేశాల‌కు సూచించింది. ఈ వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపింది. ఫలితంగా ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అలాగే.. ఒమిక్రాన్ వేరియంట్  త‌న‌ గమనాన్ని మార్చగలదని తెలిపింది. 

త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. ఒమిక్రాన్ సంక్షోభం నుంచి తప్పించుకోగ‌ల‌మ‌ని  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్  వెల్ల‌డించారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ మారుతోంది, కానీ మన సామూహిక సంకల్పం మారకూడదు అని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరిగితే..  తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంచనావేసింది. ఇదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ (omicron variant ) కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేసుల్లో పెరుగుదల, తీవ్రతలో మార్పు కారణంగా ఆరోగ్య రంగ వ్యవస్థలపై భారం పడే అవకాశముందని పేర్కొన్నారు.  

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/tdp-leader-nara-lokesh-satires-on-mangalagiri-mla-alla-ramakrishna-reddy-r3uj3s

డెల్టా కంటే ఒమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ప్రారంభ సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఇది ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు లేకుండా ఉందని, ఒమిక్రాన్ వేరియంట్ లో జరుగుతున్న ఉత్పరివర్తనాలు అందుకు కారణమని  డ‌బ్యూ హెచ్ ఓ డైరెక్టర్ వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, అసాధారణ మ్యుటేషన్లు కలిగిన ఒమిక్రాన్.. మహమ్మారి గమనంపై భారీ ప్రభావాన్ని చూపుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి’ అని అన్నారు. 

Read Also: https://telugu.asianetnews.com/video/karimanagar/corona-tests-in-karimnagar-district-government-schools-r3p099

ఒమిక్రాన్ వేరియంట్లో అసాధారణ మ్యుటేషన్ ను గుర్తించిన నేపథ్యంలో కొత్త వేరియంట్ పై టీకాల ప్రభావశీలత తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మొత్తానికే టీకా నుంచి లభించే రక్షణను ఒమిక్రాన్ వేరియంట్ ఏమార్చలేదని వెల్లడించారు. ఫైజర్, బయోన్‌టెక్ ప్రయోగాల్లోని ప్రాథమిక స‌మాచారం ప్ర‌కారం.. ఒమిక్రాన్‌ కట్టడికి బూస్టర్ డోసు ఆవశ్యకతను వెల్లడించాయి. ఇంకా కొన్ని పేద దేశాలకు తగిన స్థాయిలో టీకాలు అందలేదనే ఉద్దేశంతో ఆరోగ్య సంస్థ బూస్టర్‌ డోసుల పంపిణీకి విముఖత చూపుతోందనీ తెలిపారు. 

 ఒక వేళ .. ఒమిక్రాన్‌ కట్టడిలో బూస్టర్లు పనిచేస్తాయనే నిరూపిత‌మైతే..  సంపన్న దేశాలన్నీ దానివైపు మొగ్గుచూపుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఏదిఏమైనప్పటికీ మ‌న‌కు ఉన్నా ఏకైక  ఆయుధం వాక్సినేషన్ అని, అలాగే క‌రోనా నిబంధ‌న‌లను తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌ని తెలిపారు. ఇనాక్యులేషన్ రేట్లు తక్కువగా ఉన్న పేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచడానికి బూస్టర్‌లను నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల పై ఒత్తిడి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్ది రోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది.
 

click me!