కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. డెల్టా (Delta mutation), ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. అయితే ఒమిక్రాన్ లక్షణాలు (Omicron Symptoms) ఏమిటి..?, అది ఏ వయసు వారిపై ప్రభావాన్ని చూపుతుందనే చర్చ సాగుతుంది.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అత్యంత సమస్యసాత్మక కోవిడ్-19 వేరియంట్ల జాబితాలో చేర్చింది. అంతేకాకుండా ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. దీంతో చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు కూడా విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా 11 దేశాలలో ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.
అయితే డెల్టా (Delta mutation), ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. కానీ ఈ వేరియంట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ లక్షణాలు (Omicron Symptoms) ఏమిటి..?, అది ఏ వయసు వారిపై ప్రభావాన్ని చూపుతుందనే చర్చ సాగుతుంది.
undefined
దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ (Dr. Angelique Coetzee) మాట్లాడుతూ.. లక్షణాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈమె దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా, ఆ దేశ వ్యాక్సిన్ కమిటీలో సభ్యురాలిగా కూడా ఉన్నారు. తొలుత పేషెంట్లలో కొత్త వేరియంట్‌ను అనుమానించిన వారిలో ఈమె కూడా ఒకరు.
ఆమె ఎమన్నారంటే..?
తన క్లినిక్‌లో డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలను కలిగి ఉన్న ఏడుగురు రోగులను గమనించినట్లు కోయెట్జీ చెప్పారు. అయితే అవి చాలా తేలికపాటి లక్షణాలు అని చెప్పారు. అయితే అవి అసాధారణమైనవని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్ బారిన పడుతున్నవారిలో ఒకటి రెండు రోజులు తీవ్రమైన అలసట ఉంటుందని.. ఈ కారణంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నయని తెలిపారు. ఈ వేరియంట్ బారినపడ్డ వారిలో వాసన లేదా రుచి కోల్పోయినట్లు నివేదించలేదని తెలిపారు. కొత్త వేరియంట్‌తో ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా తగ్గుదల లేదని చెప్పారు.
also read: Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?
చాలా మంది రోగులో చాలా తేలికపాటి లక్షణాలను చూస్తున్నామని ఆమె చెప్పారు. ఇప్పటివరకు వారికి శస్త్రచికిత్స అవసరం పడలేది తెలిపారు. పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స చేయగులుగుతున్నామని వెల్లడించారు. ఈ వేరియంట్ 40 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తున్నట్టుగా తాను ఇప్పటివరకు గమనించినట్టుగా పేర్కొన్నారు.
ఇప్పటివరకు గుర్తించిన అంశాలు (Omicron Symptoms Here)..
- ఒమిక్రాన్ సోకిన వారు.. బొంగుర గొంతు, గొంతు నొప్పి గురించి ప్రధానంగా ఫిర్యాదు చేశారు.
- వారిలో విపరీతమైన అలసటను కనబరిచారు. అన్ని వయసుల వారిలో ఇది కనిపించింది.
- అయితే ఆక్సిజన్ స్థాయిలలో తీవ్రమైన తగ్గుదలని గుర్తించలేదు.
- వ్యాధి సోకిన చాలా మంది రోగులు ఆసుపత్రిలో చేరడంతో కోలుకున్నారు.
- వాసన లేదా రుచి కోల్పోయినట్టుగా నివేదించబడలేదు.
అయితే.. దక్షిణాఫ్రికాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన అనేక అంశాలపై అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ 30 మ్యూటేషన్స్ కలిగి ఉన్నట్టుగా రిపోర్ట్ చెబుతున్నాయి.
also read; Omicron Variant : ఒమిక్రాన్ ఫస్ట్ ఫొటో రిలీజ్ చేసిన రోమ్ హాస్పిటల్...ఇదేంటి ఇలా ఉంది.. !
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?
డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తుందా..? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్షలు ఈ వేరియంట్‌ను గుర్తించగలవని పేర్కొంది. ఇదివరకు కరోనా వైరస్ సోకినవారికి కూడా ఒమిక్రాన్ సంక్రమించే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ఇంతకుముందు కోవిడ్ బారిన పడినవారికి ఈ వేరియంట్ మరింత సులువుగా సంక్రమించవచ్చు. ఈ వేరియంట్‌ను డేంజరస్ కేటగిరీలో చేర్చింది.