Omicron : రాబోయే వారాల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం.. యూరోపియన్ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 12:22 PM IST
Highlights

"రాబోయే వారాల్లో, కేసులు, మరణాలు, ఆసుపత్రిలో చేరడం,  ICU అడ్మిషన్ల పారామితులు పెరుగుతాయి" అని బ్రస్సెల్స్‌లో జరిగిన EU ఆరోగ్య మంత్రుల సమావేశంలో యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ ఆండ్రియా అమ్మోన్ అన్నారు. "ఓమిక్రాన్ వేరియంట్, ఇది మొత్తం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా చేస్తుంది." అని అన్నారామె.

రాబోయే వారాల్లో కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతాయని యూరోపియన్ ఆరోగ్య సంస్థ మంగళవారం హెచ్చరించింది. ఐరోపాలో రాబోయే కొన్ని వారాల్లో COVI -19 మరణాలు, వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి కారణం కోవిడ్ ఉత్పరివర్తనాలను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఇచ్చిన టీకా రేట్లు సరిపోవని తేల్చింది. 

European countries వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వివిధ రకాల చర్యలను తీసుకున్నాయి, వీటిలో టీకాలు వేయించుకోవడాన్ని తప్పనిసరి చేయడం. లాక్‌డౌన్లు పెట్టడం, రెస్టారెంట్లు, బార్‌లను తొందరగా మూసివేయడం వంటివి ఉన్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోందని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ ఆండ్రియా అమ్మోన్ తెలిపారు.

"రాబోయే వారాల్లో, కేసులు, మరణాలు, ఆసుపత్రిలో చేరడం,  ICU అడ్మిషన్ల పారామితులు పెరుగుతాయి" అని బ్రస్సెల్స్‌లో జరిగిన EU ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఆమె అన్నారు. "ఓమిక్రాన్ వేరియంట్, ఇది మొత్తం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా చేస్తుంది." అని అన్నారామె.

19 యూరోపియన్ దేశాల్లో కనీసం 274 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ECDC తెలిపింది. అయితే ఒమిక్రాన్ వల్ల తీవ్రమైన అనారోగ్యం లేదా మరణం గురించిన నివేదికలు ఇంకాలేవని, కాకాపోతే, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని అంచనా వేయడం, దాని మీద తీర్మానాలు చేయడం అనేది too early  అని ఏజెన్సీ తెలిపింది.

Omicron: అలాంటి సంకేతాలు ఏమి లేవు.. డేల్టా కంటే తీవ్రత తక్కువే.. గుడ్ న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

EU ఆరోగ్య కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ మాట్లాడుతూ, ఆరు EU దేశాల్లో ఇప్పటికీ మొత్తం టీకా రేటు 55 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది. కోవిడ్ -19 టీకాలు తీసుకున్నవారు, వైరస్ నుండి కోలుకున్న వ్యక్తుల కోసం ఈ వారాంతంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను తీసేస్తున్నట్లు ఆస్ట్రియా మంగళవారం ధృవీకరించింది, అదే సమయంలో టీకాలు వేసుకోవడానికి నిరాకరించిన వారు  public lifeలో తిరగడాన్ని పరిమితం చేస్తుంది.

ఇక పోలాండ్ కూడా మంగళవారంనాడు పాఠశాలలకు సెలవులు పొడిగించింది. ఆఫ్ లైన్ కాకుండా ఆన్‌లైన్ విద్యకు మారింది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఉపాధ్యాయులు టీకాలు వేసుకోవడం తప్పనిసరి చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ లో ఐరోపా ఖండంలో విస్తృత అనిశ్చితి నెలకొంది. నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరికతో ఇది కొన్ని వారాల వ్యవధిలో దేశంలో ఆధిపత్య జాతిగా మారవచ్చు.

ఇదిలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అధికారి ఒకరు ఒమిక్రాన్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్.. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్‌‌ల కంటే తీవ్రమైనది అని గానీ, ఇప్పటికే ఉన్న టీకాలు దీనిపై సమర్ధవంతంగా పనిచేయవు అనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎమర్జెన్సీ‌స్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  Omicron అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ..  ఇప్పటివరకు చూసిన డెల్టా, ఇతర వేరియంట్‌ల కంటే తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ప్రస్తుతం ఉన్న టీకాలు.. ఓమిక్రాన్‌ను సంక్రమించే వ్యక్తులను రక్షించగలవని భావిస్తున్నట్టుగా చెప్పారు.

click me!