Omicron: యూకేలో కేసుల పెరుగుదల పెద్ద వేవ్‌‌కు సంకేతం..! లండన్‌లో పరిస్థితులు విషమం

By Mahesh KFirst Published Dec 19, 2021, 2:08 PM IST
Highlights

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు యూకేలో భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ అధికారికంగా కనిపించే లెక్కల కంటే కూడా భారీగా ఉండే అవకాశం ఉన్నదని ప్రభుత్వ సలహాదారులు వివరిస్తున్నారు. ఇది దేశంలో రాబోయే పెద్ద వేవ్‌కు సూచనలు ఇస్తున్నాయని చెప్పారు. వెంటనే కట్టడి చర్యలు తీసుకోకుంటే రోజుకు 3000 హాస్పిటల్ అడ్మిషన్ల స్థాయికి  చేరవచ్చునని తెలిపారు.
 

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నది. ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా వ్యాపించడమే కాదు.. తీవ్ర పరిణామాలకూ బీజం వేస్తున్నది. ఇప్పటికే కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్(Lock Down) ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కొత్త వేవ్(Wave) వచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాగానే యూకే వెంటనే చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ యూకేలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. క్రమంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ కేసులే దేశంలో రాబోయే అతిపెద్ద వేవ్‌కు సంకేతాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

శుక్రవారం సాయంత్రానికల్లా దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సుమారు 25వేలను తాకాయి. 24 గంటల కంటే ముందు ఉన్న కేసుల కంటే మరో 10వేలకు మించిన ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయినట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డవారిగా భావిస్తున్న ఏడుగురు గురువారం మరణించారు. మంగళవారం ఒమిక్రాన్ వేరియంట్‌తో మరణించిన వారి సంఖ్య ఒక్కటికి మించి లేదు. కాగా, హాస్పిటల్‌లో చేరిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇప్పటి వరకు 65 కేసులు హాస్పిటల్‌లో చేరినట్టు రిపోర్టులు ఉండగా తాజాగా ఈ సంఖ్య 85కు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సలహాదారులు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కేసులు సముద్రంలో బయటకు ఒక కొస కనిపించే మంచు శిఖరం వంటివని, లోతుల్లో మరెన్నో కేసులు ఉన్నాయని వివరించారు. ఇది భవిష్యత్‌లో రాబోయే పెద్ద వేవ్‌కు సంకేతాలు అని పేర్కొన్నారు. కాగా, లండన్‌లో ప్రస్తుత పరిస్థితులను మేజర్ ఇన్సిడెంట్‌గా మేయర్ ప్రకటించారు. హాస్పిటల్స్‌లో బెడ్లు, ఇతర సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేయడానికి ప్రభుత్వ ఏజెన్సీలు సమయన్వం చేసుకోవాలని వివరించారు. 

Also Read: Coronavirus: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

పరిస్థితులు ఇలా ఉండగా ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్(సేజ్) మరో ఆందోళనర అంచనాలను ప్రకటించింది. వాస్తవంలో రోజుకు వేలాది మంది లేదా లక్షకు అటు ఇటుగా మంది కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారని తెలిపింది. కానీ, ఆ వివరాలు అధికారిక గణాంకాల్లో ప్రతిఫలించడం లేదని వివరించింది. కరోనా కట్టడి చర్యలు మరింత కఠినతరం చేయకుంటే ఇంగ్లాండ్‌లో ప్రతి రోజు హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య 3000లను తాకే ముప్పు ఉన్నదని అంచనా వేసింది. డిసెంబర్ 16వ తేదీ నిర్వహించిన సమావేశంలో ఈ అంచాలను ప్రకటించారు.

ఇంగ్లాండ్‌లో టీకా పంపిణీ వేగవంతం కావడానికి ముందు అంటే జనవరిలో అక్కడ హాస్పిటలైజేషన్ తీవ్రంగా ఉండింది. అప్పుడు రోజుకు 4000ల మంది చొప్పున కరోనాతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.

Also Read: Covid Third wave: జనవరిలో కరోనా థర్డ్ వేవ్.. కొత్తగా సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం !

లండన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేసుల భారీగా పెరుగుతున్నాయని, దాని ప్రభావం హాస్పిటల్ వ్యవస్థపై తీవ్రంగా పడుతున్నదని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం అవసరం అని చెప్పారు. ఈ వారంలో హాస్పిటల్ అడ్మిషన్లు సుమారు 30 శాతం పెరిగాయని తెలిపారు.

click me!