అలస్కాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ.. !!

By AN TeluguFirst Published Jul 29, 2021, 2:47 PM IST
Highlights

అలస్కాలోని పెర్రివిల్లేకు తూర్పు ఆగ్నేయంలో 56 మైళ్ళ దూరంలో తీవ్రమైన  భూకంపం కేంద్రీకృతమై ఉంది.  స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించిందని యుఎస్‌జిఎస్ తెలిపింది.

అలస్కా : యుఎస్ జియోలాజికల్ సర్వే అలస్కాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు చేసింది. జియోలాజికల్ సర్వే నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అలస్కా తీర ప్రాంతంలో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

అలస్కాలోని పెర్రివిల్లేకు తూర్పు ఆగ్నేయంలో 56 మైళ్ళ దూరంలో తీవ్రమైన  భూకంపం కేంద్రీకృతమై ఉంది.  స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించిందని యుఎస్‌జిఎస్ తెలిపింది.

భూమికి 29 మైళ్ల లోతులో (46.7 కిమీ) ఈ భూకంపం సంభవించింది. దీన్ని షాలో ఎర్త్ కేక్ అంటారు. తక్కువ లోతులో ఏర్పడే భూకంపాలను షాలో ఎర్త్ కేక్స్ అంటారు. భూమినుంచి 0 - 70 కిలోమీటర్ల లోతు వరకు సంభవించే భూకంపాలను ఈ కేటగిరీలో చేరుస్తారు. 

అందుకే వెంటవెంటనే మరో రెండు భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇవి వరుసగా మాగ్నిట్యూడ్ 6.2, మాగ్నిట్యూడ్ 5.6 గా ఉంటాయని  యుఎస్‌జిఎస్ నివేదికలు తెలుపుతున్నాయి. 

అందుకే అలస్కా రాష్ట్రంలోని కొన్ని భాగాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పం, హిన్చిన్‌బ్రూక్ ఎంట్రన్స్ నుండి (సెవార్డ్‌కు తూర్పున 90 మైళ్ళు) యునిమాక్ పాస్ వరకు, అలాగే అలూటియన్ దీవులకు, యునిమాక్ పాస్ (యునలస్కాకు ఈశాన్యంగా 80 మైళ్ళు) నుండి, అలస్కాలోని సమల్గా పాస్ వరకు.. అంటే నికోల్క్సీ కి నైరుతిగా  30మైళ్ల వరకు ఈ హెచ్చరికలు చేసింది. 

కోడియాక్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణమైన కోడియాక్‌లోని స్థానికులను  హై గ్రౌండ్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీన్ని తుఫాను సహాయక కేంద్రంగా తెరిచి ఉంచామని తెలిపారు.  

కొడియాక్ ద్వీపంలోనివాయువ్య మూలలో కొడియాక్ పట్టణం ఉంది. ఇది అలాస్కాలోని అతిపెద్ద ద్వీపం. యుఎస్‌లో రెండవ అతిపెద్ద ద్వీపం. అలాగే హవాయిలో కూడా సునామీ వాచ్ జారీ చేయబడింది. కానీ, తరువాత అది రద్దు చేయబడింది. 

"అందుబాటులో ఉన్న అన్నిరకాల డేటాల ప్రకారం అక్కడ సునామీ ముప్పు లేదు" అని నేషనల్ వెదర్ సర్వీస్ పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర అమెరికాలోని ఇతర యుఎస్, కెనడియన్ పసిఫిక్ తీరాలకు సునామీ ప్రమాదం స్థాయిని అంచనా వేస్తున్నట్లు NWS తెలిపింది.

click me!