ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ.. మూడు రోజుల్లో 8.20 లక్షల కేసులు

Published : May 15, 2022, 02:41 PM ISTUpdated : May 15, 2022, 02:54 PM IST
ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ.. మూడు రోజుల్లో 8.20 లక్షల కేసులు

సారాంశం

ఉత్తర కొరియాలో కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 8.20 లక్షల కేసులు నమోదైనట్టు అధికారిక మీడియా వెల్లడించింది. ఇందులో 3.24 లక్షల మంది చికిత్స పొందుతున్నట్టు వివరించింది. ఈ మూడు రోజుల్లో 42 మంది మరణించినట్టు తెలిపింది.  

న్యూఢిల్లీ: ఉత్తర కొరియాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. సింగిల్ డే కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర కొరియాలో తొలిసారి గురువారం కరోనా కేసు నమోదైనట్టు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల్లోనే 8,20,620 కేసులు నమోదైనట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. కనసీం 3,24,550 మంది ట్రీట్‌మెంట్ పొందుతున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు ఈ వ్యాధితో 42 మంది మరణించినట్టు వివరించింది.

ఈ దేశం ఆవిర్భవించినప్పటి నుంచి తొలిసారిగా ఈ స్థాయిలో ఒక వ్యాధి వ్యాపిస్తున్నదని ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ శనివారం అన్నారు. ఇప్పుడు ఈ మహమ్మారి పరాకాష్ట స్థితికి చేరిందని తెలిపారు. అత్యధిక తీవ్రతతో ఎమర్జెన్సీ క్వారంటైన్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నారు.

ఉత్తర కొరియాలో కరోనా టీకా పంపిణీ చేయలేదు. ఉత్తర కొరియాకు చైన, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్వర్యంలో కొవాక్స్ టీకాలను ఆఫర్ చేసింది. కానీ, ఉత్తర కొరియా మాత్రం ఈ టీకాలను తిరస్కరించింది. అదీగాక, ఈ దేశంలో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్నది. ఎక్కువ మందికి కరోనా టెస్టింగ్ చేసే సామర్థ్యం కూడా లేదు.

అయితే, ఇప్పుడు చైనా, దక్షిణ కొరియాలు ఈ దేశానికి వైద్యపరమైన సహాయం, టీకాలు అందించడానికి తాజాగా ఆఫర్ చేశాయి.

ఈ స్థాయిలో కరోనా కేసులు రిపోర్ట్ కావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేపుతున్నది. కేసీఎన్ఏ మూడు రోజుల్లో ఈ స్థాయిలో కేసులు నమోదైనట్టు తెలిపింది. కానీ, కేసులు, మరణాలు అన్నీ టెస్టులో కొవిడ్ పాజిటివ్ అని తేలాయా? లేదా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ స్థాయిలో టెస్టులు, చికిత్స అందించడం ఉత్తర కొరియా ఆరోగ్య వ్యవస్థకు సాధ్యం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. 

ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో న్యూక్లియర్ టెస్టు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపిస్తున్నాయి. దేశంలోని ఈ దారుణ పరిస్థితుల నుంచి పౌరుల దృష్టి మరల్చడానికి ఆయన మరో న్యూక్లియర్ టెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వాదిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే