పుతిన్‌ను గద్దె దించడానికి తిరుగుబాటు మొదలైంది.. దాన్ని ఎవరూ ఆపలేరు: ఉక్రెయిన్ మిలిటరీ జనరల్

Published : May 15, 2022, 12:52 PM ISTUpdated : May 15, 2022, 12:55 PM IST
పుతిన్‌ను గద్దె దించడానికి తిరుగుబాటు మొదలైంది.. దాన్ని ఎవరూ ఆపలేరు: ఉక్రెయిన్ మిలిటరీ జనరల్

సారాంశం

రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం బాగాలేని, పలువ్యాధులతో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. తాజాగా, ఉక్రెయిన్ మిలిటరీ సీనియర్ నేత ఒకరు పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను గద్దె దించడానికి తిరుగుబాటు జరుగుతున్నదని, దాన్ని ఆపడం సాధ్యపడదని తెలిపారు.

న్యూఢిల్లీ: తూర్పు యూరప్‌లో యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను గద్దె దింపడానికి తిరుగుబాటు జరుగుతున్నదని ఉక్రెయిన్ మిలిటరీ అధికారి తెలిపారు. అంతేకాదు, ఆ తిరుగుబాటును అడ్డుకోవడం, ఆపడం కూడా సాధ్యపడదని వివరించారు. ఉక్రెయిన్ మిలిటరీ జనరల్ కిరిలో బుదనోవ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఆగస్టు నెల మధ్యలో కీలక మలుపు తిరుగుతుందని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా యుద్ధం ముగుస్తుందని వివరించారు. ఒక వేళ ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్‌ను తొలగిస్తారని ఊహించారు. అంతేకాదు, ఆ దేశమే కుప్పకూలుతుందని అన్నారు.

ఈ యుద్ధం రష్యా నాయకత్వాన్ని మార్చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ వైపుగా చర్యలు మొదలయ్యాయని తెలిపారు. అంటే.. రష్యాలో తిరుగుబాటు మొదలైందా? అని ప్రశ్నించగా ఔను అని సమాధానం ఇచ్చారు. వారు ఆ తిరుగుబాటువైపుగానే అడుగులు వేస్తున్నారని తెలిపారు.

అంతేకాదు, వ్లాదిమిర పుతిన్‌కు క్యాన్సర్ ఉన్నదని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆరోపణలు చేశారు. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన మానసిక, శారీరక ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని వివరించారు. ఇన్ఫర్మేషన్ వార్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే వ్యాఖ్యలు రాగానే వాటిని ఆయన కొట్టివేశారు.  ఈ వాస్తవాలు చెప్పడం తన బాధ్యత అని, ఈ విషయాల గురించి తనకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుందని వివరించారు.

ఇటీవలి కాలంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగాలేదనే వదంతులు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. పలువురు నేతలతో ఆయన మాట్లాడుతూ షివరింగ్ అవుతున్నారని, వణఇకిపోతున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆయనకు పార్కిన్సన్ డిసీజ్ సోకి ఉంటుందనే వాదనలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై రష్యా స్పందించలేదు.

రష్యా అధ్యక్షుడు బలవంతంగా, సమర్థవంతుడిగా కనిపించడానికి క్రెమ్లిన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. 

ఇప్పటికే రష్యా.. పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నది. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెరతీసిన సంగతి తెలిసిందే. నాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూనే రష్యా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. తద్వారా ఇతర పొరుగు దేశాలు నాటో వైపు చేరబోవనే ఆలోచన కూడా ఇందులో ఉన్నది. కానీ, రష్యా ఆలోచనలకు భిన్నమైన పరిణామాలు ఎదురు వస్తున్నాయి. తాజాగా, రష్యా పొరుగు దేశం ఫిన్లాండ్ కూడా నాటోలో చేరతామనే ప్రకటన చేసింది. నాటో కూటమి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటామని ఫిన్లాండ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రకటించారు. దీనికి కారణం రష్యానే అని, ‘మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి’ అంటూ రష్యాపై ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్తో మండిపడ్డారు.

నాటో కూటమిలో చేరడంపై ఫిన్లాండ్ పార్లమెంటులో ఇంకా చర్చ జరగాల్సి ఉన్నది. నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ, ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఆ దేశం నాటో కూటమిలో చేరడానికి గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగానే అర్థం అవుతున్నది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఫిన్లాండ్ మాత్రమే కాదు.. స్వీడన్ కూడా ఇదే ఆలోచనల్లో ఉన్నది.

 కాగా, రష్యా మాత్రం ఫిన్లాండ్ దేశానికి వార్నింగ్ ఇచ్చింది. నాటో కూటమిలో చేరే ప్రయత్నాలు చేస్తే ఆ దేశంపై ప్రతీకార చర్యలు తీసుకోవడానికి రష్యాను పురికొల్పినట్టు అవుతుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరిచింది. రష్యా భద్రతకు ముప్పుగా భావించి ఆ దేశం నాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే