ఆర్థిక విభాగంలో ముగ్గురు అమెరికా ఎకానమిస్టులకు నోబెల్ బహుమతి

By Mahesh KFirst Published Oct 10, 2022, 4:38 PM IST
Highlights

ముగ్గురు అమెరికా ఆర్థికవేత్తలకు ఈ ఏడాది ఆర్థిక నోబెల్ ప్రకటించారు. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని వీరు ముగ్గురు పంచుకోనున్నారు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధనలు ఉపకరించాయని జ్యూరీ పేర్కొంది.
 

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు ఎకానమిస్టులకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన బెన్ ఎస్ బెర్నాంకె, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ దిబ్విగ్‌లకు ఆర్థిక నోబెల్‌ను ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో బ్యాంకుల పాత్రను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి.. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల్లో మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి వాళ్లు పరిశోధనలు చేశారు. ఫైనాన్షియల్ మార్కెట్లను ఎలా రెగ్యులేట్ చేయాలని అనే అంశంపైనా చేసిన కృషికిగాను జ్యూరీ ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించింది.

నోబెల్ బహుతి విజేతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్‌లను పొందుతారు. ఈ పురస్కారాలను డిసెంబర్ 10వ తేదీన విజేతలకు అందజేస్తారు. నోబెల్ బహుమతుల్లో ఆర్థిక శాస్త్ర విభాగంలో అందించే పురస్కారాలకు భిన్నమైనవి. ఎందుకంటే.. మిగతా వాటిని 1895లో అల్ఫ్రెడ్ నోబెల్ ఈ బహుమతులను స్థాపించారు. కానీ, ఆర్థిక విభాగంలో నోబెల్ బహుమతిని ఆ తర్వాత మిగతా వాటితో చేర్చారు. ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన వారినీ గుర్తించాల్సిన అవసరం ఉన్నదని గుర్తించారు.

ఈ ఏడాది నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే.. సోమవారం వైద్య శాస్త్రంలో, మంగళవారం భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించారు. నేడు రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతను ప్రకటించారు. గురువారం సాహిత్య రంగంలో నోబెల్ విజేత పేరు ప్రకటిస్తారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను శుక్రవారం ప్రకటించనున్నారు. అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేతను వెల్లడించనున్నారు. 

1895 నాటి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం.. నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. 1901 నుంచి సైన్స్, సాహిత్యం, శాంతికి సంబంధించి అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఇక, 1968 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు.

click me!