ప్యాంటులో మూడు కొండచిలువలు పెట్టుకుని.. సరిహద్దులు దాటించే ప్రయత్నం.. చివరికి...

By SumaBala BukkaFirst Published Oct 10, 2022, 9:58 AM IST
Highlights

అమెరికా-కెనడా సరిహద్దుల్లో మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన నేరం కింద.. 36 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను వీటిని తన ప్యాంటులో పెట్టుకుని తరలించడానికి ప్రయత్నించాడు.

అమెరికా : కెనడా నుండి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేస్తున్న అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యుఎస్-కెనడియన్ సరిహద్దుల ద్వారా అతను ఆ రెప్టైల్స్ ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాటిని అతను తన ప్యాంటు జేబులో దాచుకున్నాడని పోలీసులు ఆరోపించారు.

అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కాల్విన్ బౌటిస్టా (36) అనే వ్యక్తి జూలై 15, 2018న ఉత్తర న్యూయార్క్‌కు చేరుకున్న బస్సులో పాములను దాచిపెట్టాడు. బర్మీస్ పైథాన్‌ల దిగుమతి అంతర్జాతీయ ఒప్పందం, సమాఖ్య చట్టం ద్వారా నియంత్రించబడినందున న్యూయార్క్ మ్యాన్ నేరానికి సంబంధించి ఫెడరల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బర్మీస్ పైథాన్‌లు మనుషులకు హాని కలిగించే జంతువుల జాబితాలో చేర్చబడ్డాయి. 

ఫెడరల్ స్మగ్లింగ్ ఆరోపణలపై బటిస్టాను ఈ వారం న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీలోని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, విచారణ పెండింగ్‌లో ఉంచి.. అతడిని విడుదల చేశారు. బర్మీస్ పైథాన్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి.  ఇది మనుషులకు హాని కలిగించే స్థానిక ఆసియా జాతిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, ఈ జాతి యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడాలో అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. వీటివల్ల స్థానిక జంతువులకు హాని పొంచి ఉంది.

కెనడా నుండి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాల్విన్ బటిస్టాకు, నేరం రుజువైతే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష, 250,000 డాలర్ల జరిమానా విధించబడుతుంది.

వెనిజులాలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 25మంది మృతి, 52మంది గల్లంతు..

click me!