ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

By narsimha lodeFirst Published Oct 6, 2020, 4:44 PM IST
Highlights

ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. మంగళవారం నాడు నోబెల్ కమిటీ ఫిజిక్స్ లో అవార్డును ప్రకటించింది.

స్టాక్‌హోమ్:  ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. మంగళవారం నాడు నోబెల్ కమిటీ ఫిజిక్స్ లో అవార్డును ప్రకటించింది.

రోజర్ పెన్‌రోజ్, రెన్‌హార్డ్ గెజల్, అండ్రియా గెజ్ లకు సంయుక్తంగా ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ దక్కింది.కృష్ణబిలం, పాలపుంతల రహస్యాలను తెలుసుకొన్నందుకు గాను ఈ ముగ్గురి శాస్త్రవేత్తలకు ఈ బహుమతులు లభ్యమయ్యాయి.

also read:హెపటైటీస్ సీ వైరస్: ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

ఐన్ స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్దాంతమే కృష్ణ బిలాలు ఏర్పడడానికి మూలమని రోజర్ పెన్ రోజ్ అభిప్రాయపడ్డారు. పాలపుంతలో దుమ్ము, ధూళి, ఇతర వాయువులతో దట్టమైన మేఘాలున్నట్టుగా రెన్‌హార్డ్ గెజల్, అండ్రియా గెజ్ లు గుర్తించారు. గెలాక్సీలో ఒక వస్తువును వీరు గుర్తించారు.

ఈ ప్రైజ్ సగభాగాన్ని రోజర్ పెన్ రోజ్, మిగిలిన సగభాగాన్ని మరో ఇద్దరికి దక్కనుంది.నోబెల్ బహుమతి 10 మిలియన్లను ముగ్గురిలో ఒకరికి సగ భాగం, మిగిలిన సగాన్ని మరో ఇద్దరికి దక్కనుంది.

వైద్య రంగంలో విశేష కృషి చేసిన ముగ్గురికి సోమవారం నాడు నోబెల్ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించారు.

click me!