ప్రతి 10 మందిలో ఒక్కరికి కరోనా: 800 మిలియన్ల మందికి కోవిడ్ డబ్లుహెచ్ఓ అంచనా

By narsimha lode  |  First Published Oct 6, 2020, 10:13 AM IST

ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది



జెనీవా: ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సమావేశం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచంలోని సుమారు 34 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచం ఇంకా  ప్రమాదంలోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

ప్రపంచంలో 35 మిలియన్ల మందికి మాత్రమే కరోనా సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారంగా కరోనా సోకిన వారి సంఖ్య 800 మిలియన్లుగా ఉంటుందని ప్రకటించింది.ధృవీకరించిన కేసుల కంటే కరోనా సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని  నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. 

Latest Videos

undefined

గత పది నెలలుగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో రెండో దశ కరోనా వైరస్ ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదౌతున్నట్టుగా డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది.

ప్రపంచ జనాబాలో 760 కోట్లలో.... 76 కోట్ల మంది కరోనా బారినపడ్డారని డబ్లుహెచ్ఓ అంచనాతో జాన్సన్ హాకిన్స్ యూనివర్శిటీ  అంచనాలు సరిపోయాయి.

click me!