ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

By Nagaraju TFirst Published Oct 2, 2018, 4:24 PM IST
Highlights

భౌతిక శాస్త్రంలో వివిధ పరిశోధనలు చేసిన ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది. ప్రతీఏటా నోబెల్ అసెంబ్లీ భౌతిక శాస్త్రంలో సేవలందించిన శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ అందిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది ఫిజిక్స్ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ బహుమతిని అందుకోనున్నారు. వారిలో 55ఏళ్ల మహిళా శాస్త్రవేత్త ఉండటం విశేషం. 

స్వీడన్: భౌతిక శాస్త్రంలో వివిధ పరిశోధనలు చేసిన ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది. ప్రతీఏటా నోబెల్ అసెంబ్లీ భౌతిక శాస్త్రంలో సేవలందించిన శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ అందిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది ఫిజిక్స్ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ బహుమతిని అందుకోనున్నారు. వారిలో 55ఏళ్ల మహిళా శాస్త్రవేత్త ఉండటం విశేషం. 

అమెరికాకు చెందిన అర్థర్ అస్కిన్, ఫ్రాన్స్ కు చెందిన జెరాడ్ మౌరౌ, కెనెడాకు చెందిన డొన్నా స్ట్రిక్ లాండ్ లను ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. నోబెల్ పురస్కారం అందుకున్నమూడో శాస్త్రవేత్తగా స్ట్రిక్ లాండ్ రికార్డు నెలకొల్పారు. 

ఫిజిక్స్ విభాగంలో నోబెల్ పురస్కారం అందుకున్న తొలిమహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. అడ్వాన్స్డ్ లేజర్ ఫిజిక్స్ విభాగంలో చేసిన పరిశోధనలకు గాను డొన్నాస్ట్రిక్ లాండ్ నోబెల్ ప్రైజ్ కు ఎంపికయ్యారు.  

నోబెల్ పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల(7,80,000 పౌండ్లు) నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు. 

వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్‌ బహుమతి ప్రదానం చేస్తారు. అలాగే నోబెల్ శాంతి పురస్కారం కూడా అందజేస్తారు. అయితే కొన్ని లైంగిక ఆరోపణల కారణాల వల్ల ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతి ఇవ్వడం లేదని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. 

ఇప్పటికే వైద్య రంగం, భౌతిక శాస్త్రం విభాగాలకు నోబెల్ అసెంబ్లీ పురస్కారాలు ప్రకటించింది. రసాయన శాస్త్రం విభాగంలో నోబెల్ పురస్కారాన్ని బుధవారం ప్రకటించనుంది. అక్టోబరు 5 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్‌ పురస్కారాల విజేతలను వెల్లడించనున్నట్లు నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. 

ఈ వార్తలు కూడా చదవండి

వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్ పురస్కారాలు

click me!