1,234కు చేరుకున్న సునామీ మృతులు

By Nagaraju TFirst Published Oct 2, 2018, 3:07 PM IST
Highlights

సునామీ-భూకంపం విసిరిన పంజాకు పాలూ నగరం కకావికలమైంది. ప్రకృతి ప్రకోపానికి పాలూ నగరం స్మశాన వాటికను తలపిస్తోంది. పాలూ నగరంలో ఎటు చూసినా మృతదేహాలే. శిథిలాల కింద మృతదేహం. సముద్ర తీర ప్రాంతంలోని ఇసుకలో మృతదేహాలు. వీధిల్లో మృతదేహాలు. 

ఇండోనేషియా: సునామీ-భూకంపం విసిరిన పంజాకు పాలూ నగరం కకావికలమైంది. ప్రకృతి ప్రకోపానికి పాలూ నగరం స్మశాన వాటికను తలపిస్తోంది. పాలూ నగరంలో ఎటు చూసినా మృతదేహాలే. శిథిలాల కింద మృతదేహం. సముద్ర తీర ప్రాంతంలోని ఇసుకలో మృతదేహాలు. వీధిల్లో మృతదేహాలు. ఇలా ఎటు చూసినా శవాలతో పాలూనగరం శవాల దిబ్బను తలపిస్తోంది. 

నాలుగు రోజుల క్రితం ఏర్పడిన ఈ ఉపద్రవం మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పదుల సంఖ్య నుంచి వేల సంఖ్యకు చేరుకుంది. ఇప్పటి వరకు 1,234 మంది మృతి చెందినట్లు ఇండోనేషియా విపత్తుల నిర్వహణ శాఖ అధికారి సుటోపో పుర్వో తెలిపారు. 

సునామీ-భూకంపం ఏకకాలంలో రావడంతో భారీగా మృతుల సంఖ్య నమోదైనట్లు పుర్వో తెలిపారు. అయితే కొన్నిమృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉండటంతో ఆ మృతదేహాలను  వాలంటీర్లే సామూహికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

ఇదిలా ఉంటే పాలూ నగరంలోని కొండ ప్రాంత ప్రజల పరిస్థితి ఇంకా తెలియడం లేదని తెలిపారు. సహాయక బృందాలు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదని చెప్పారు. అయితే కొంతమంది సహాయక సిబ్బంది సాహసం చేసి వెళ్లారని అయితే అక్కడ నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో వాతావరణం అనుకూలిస్తే మరిన్ని సహాయక బృందాలను పంపుతామని పుర్వో తెలిపారు.   

మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం వాలంటీర్లకు పెద్ద సవాల్ గా మారింది. కొన్ని పాడవ్వకుండా గుర్తుపట్టేలా ఉన్న మృతదేహాలను స్ట్రెచర్‌లపై తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సముద్రంలో నుంచికొట్టుకు వచ్చిన మృతదేహాలు కుళ్లి పోవడంతో వాటిని పెద్ద పాలిథీన్‌ సంచుల్లో తీసుకు వచ్చి సామూహిక ఖననం చేస్తున్నారు. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండటంతో వ్యాధులు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

click me!