అంతులేని విషాదాన్ని నింపిన సునామీ: సమాధుల తవ్వేందుకు వాలంటీర్లు

By Nagaraju TFirst Published Oct 1, 2018, 6:59 PM IST
Highlights

ఇండోనేసియాలోని పాలూ నగరంలో సునామీ-భూకంపం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ఈ ప్రకృతి విపత్తు విసిరిన పంజాకు పాలూ నగరం కకావికలమైంది. ఎటు చూసినా శవాలతో నగర వీధులు నిండిపోయాయి. దీంతో పాలూ నగరం శవాల దిబ్బను తలపిస్తోంది. 

ఇండోనేషియా: ఇండోనేసియాలోని పాలూ నగరంలో సునామీ-భూకంపం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ఈ ప్రకృతి విపత్తు విసిరిన పంజాకు పాలూ నగరం కకావికలమైంది. ఎటు చూసినా శవాలతో నగర వీధులు నిండిపోయాయి. దీంతో పాలూ నగరం శవాల దిబ్బను తలపిస్తోంది. ఏ అడుగుకింద ఏశవం ఉంటుందో తెలియని పరిస్థితి. 
 
బీచ్‌ ఫెస్టివల్‌ వేడుకకు సర్వం సిద్ధం చేస్తుండగా ఒక్క ఉదుటున వచ్చిన సునామీ కల్లోలం సృష్టించింది. మృత్యువులా దూసుకువచ్చింది. సునామీ ధాటి నుంచి తప్పించుకున్నా భూకంపం వారిని వీడలేదు. సునామీ దాటి నుంచి తప్పించుకుని ఇళ్లలోకి వెళ్లి రక్షించుకుందామనుకుంటే భూకంపం ప్రభావంతో ఇళ్లు కుప్పకూలిపోయాయి. 

దీంతో భవనాల శిథిలాల కింద, వీధుల వెంట శవాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దయనీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

 తలమునకలై ఉండగా ఒక్క ఉదుటున వచ్చిన సునామీ కల్లోలం సృష్టించింది. ఎటు చూసినా కూలిపోయిన భవనాల శిథిలాలు, వీధుల వెంట శవాలు..ఇలా ఈ నగర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. తొలుత సునామీ కారణంగా 42మంది మృతి చెందారని ప్రకటించగా వెంటనే అంతకు 10రెట్లు మృతుల సంఖ్య పెరిగింది. 

ఆదివారానికి 832మంది మృతి చెందారని ధ్రువీకరించగా.. ఆ సంఖ్య ఇప్పుడు 1,000దాటేలా ఉందని అధికారులు సోమవారం వెల్లడించారు.అయినవాళ్లు జాడ తెలియకపోవడంతో వారి బాధ అంతులేని ఆవేదనగా మిగిలింది.

ప్రకృతి ప్రకోపానికి వెయ్యిమంది మృత్యువాత పడితే క్షతగాత్రుల సంఖ్య లక్షల్లో ఉంది. క్షతగాత్రులు ఆర్తనాదాలతో పాలూ నగరం మార్మోగిపోతుంది. ఏ ఒక్కరిని కదిపినా వారి ఆవేదనకు అంతే లేకుండా పోతుంది. ప్రాణాలు కోల్పోకుండా మృత్యుంజయుడిలా బ్రతికినా సరైన వైద్యం అందక నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. 

సునామీ, భూకంపం ధాటికి ఆస్పత్రులు సైతం కుప్పకూలిపోవడంతో క్షతగాత్రులకు వైద్యం అందని పరిస్థితి. సకాలంలో వైద్యం అందక అశువులుబాస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇకపోతే భూకంపం, సునామీ ధాటికి కొన్ని ఆస్పత్రులు నేలమట్టమవ్వగా మిగిలిన ఆస్పత్రుల్లో ఔషధాలు నిండుకున్నాయి. 

మరోవైపు కొండ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఇంక తెలియని పరిస్థితి. కొండ ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంత అక్కడ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన వ్యక్తమవుతుంది.  
 
వైద్యం అందక, ఆహారం లేక కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క నానా పాట్లు పడుతున్న పాలూ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థలన్నీ ముందుకు రావాలని ఇండోనేషియా దేశ అధ్యక్షుడు జొకో విడోడో పిలుపునిచ్చారు. 

పాలూ నగర బాధితులకు సహాయక చర్యలు అందించాలని కోరారు. అంతర్జాతీయ సాయం కోరడానికి విడోడో అంగీకరించారు. ఇక్కడ సహాయకచర్యలు అందించాలనుకున్న వారు నేరుగా ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చునని ట్వీట్ చేశారు. 

సునామీ తర్వాత 42 మృతదేహాలు లభించడంతో ప్రాణ నష్టం అంతగా లేదని అంతా భావించారు. గంటల వ్యవధిలోనే ఆ సంఖ్య పదిరెట్లు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు నగరాల నుంచి వాలంటీర్లను రప్పిస్తున్నారు. 

వాలంటీర్లు మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు సమాధులు తవ్వుతున్నారు. ఒక్కోప్రాంతంలో లభ్యమైన మృతదేహాలను ఒక చోటుకు చేర్చి ఒక్కో చోట 100మీటర్ల చొప్పున సమాధులు తవ్వించి అందులో మృతదేహాలను పాతి పెడుతున్నారు. కొన్ని మృతదేహాలను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు గుర్తుపట్టలేనివిగా ఉండటంతో వాటికి వలంటీర్లే అంత్యక్రియలునిర్వహిస్తున్నారు.  

click me!