నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న నదియా మురాద్, డెనీస్ మక్ వేగ్

By Nagaraju TFirst Published Oct 5, 2018, 3:54 PM IST
Highlights

 2018 నోబెల్ శాంతి బహుమతిని డెనిస్ మక్ వెగ్ ,నదియా మురాద్ లు దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇరాక్ కు చెందిన నదియా మురాద్,  కాంగోకు చెందిన డెనీ మక్ వేగ్ లను వరించింది.  

నార్వే: 2018 నోబెల్ శాంతి బహుమతిని డెనిస్ మక్ వెగ్ ,నదియా మురాద్ లు దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇరాక్ కు చెందిన నదియా మురాద్,  కాంగోకు చెందిన డెనీ మక్ వేగ్ లను వరించింది.  

డెనీస్ మక్ వేగ్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు పోరాటం చేస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడ్డ వేల మంది మహిళలకు చేయూతనిస్తూ వారికి సేవలందిస్తున్నారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్నినిర్మూలించేందుకు డెనీస్ పోరాటం చేశారు. మక్ వెగ్ గైనకాలజిస్ట్ కూడా. ఇరాక్ లో మానహహక్కుల నేతగా సేవలందిస్తున్నారు నదియా మురాద్. యాజిదీ తెగకు చెందిన మురాద్ ను 2014 ఆగస్టు 5న ఐసిస్ ఉగ్రవాదులు అపహరించుకుపోయారు.  

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కారణంగా తనపై జరిగిన లైంగిక దాడిని ఇతర యాజిదీ యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఉగ్రవాదుల చెరనుంచి తప్పించుకున్న సుమారు 3000 మంది మహిళలను రక్షించి వారికి అండగా నిలిచారు. 

యాజిదీ యువతులపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు పాటుపడుతున్నారు. నదియా మురాద్ చేస్తున్న పోరాటానికి గాను ఆమెను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. అంతేకాదు ధైర్యసాహసాలతో ఐసిస్ చెర నుంచి తప్పించుకుని బాధితుల కోసం పోరాడుతున్న నదియా మురాద్ ను యూఎన్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. 

డెనీస్ మక్ వేగ్, నదియా మురాద్ లు నోబెల్ శాంతి బహుమతికింద వచ్చే 9 మిలియన్ల స్వీడిష్ లక్రోనోర్ అంటే 1.01 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీని పంచుకోనున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం 331 నామినేషన్లు రాగా ఈ ఇద్దరిని ఎంపిక చేసింది నోబెల్ అసెంబ్లీ. 

డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఆరు అవార్డులలో ఒకటి నోబెల్ శాంతి బహుమతి. ప్రతి సంవత్సరం శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, మరియు ఔషధరంగం అనే ఆరు రంగాలలో ఎవరైతే వారి చర్యల ద్వారా మానవజాతికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తారో వారికి ఈ సంస్థ అవార్డులను ప్రదానం చేస్తుంది.
ఇతర నోబెల్ బహుమతులు స్వీడన్ లో ఇస్తే నోబెల్ శాంతి బహుమతి మాత్రం నార్వేలో ప్రదానం చేస్తారు. 
  

click me!