పోలీసులు లక్ష్యంగా.. అమెరికాలో కాల్పులు..ఒకరి మృతి

Published : Oct 04, 2018, 10:12 AM IST
పోలీసులు లక్ష్యంగా.. అమెరికాలో కాల్పులు..ఒకరి మృతి

సారాంశం

ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 23 వేల 408 మంది పోలీసులు సర్వీసులో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ సంఖ్య 112గా ఉన్నట్లు ఆఫీసర్ డౌన్ మెమోరియల్ పేజ్‌లో ఉంది.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఓ ఆగంతకుడు ఏడు మంది పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఓ పోలీసు చనిపోగా, మిగతా ఆరుగురు గాయపడ్డారు. ఫ్లోరెన్స్ సిటీలో ఈ ఘటన జరిగింది. 

పిల్లలను బంధీగా తీసుకున్న ఆ ఆగంతకుడిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆగంతకుడు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. కాల్పుల ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 

ఫ్లోరెన్స్ ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మృతి చెందిన పోలీసు కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 23 వేల 408 మంది పోలీసులు సర్వీసులో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ సంఖ్య 112గా ఉన్నట్లు ఆఫీసర్ డౌన్ మెమోరియల్ పేజ్‌లో ఉంది. గత ఏడాది అమెరికాలో 15 వేల మంది తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. గన్ వాయిలెన్స్ ఆర్కీ వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌