‘ఇంత విషమిచ్చి.. చంపేయండి..’ భారత్ ను కోరిన ఆస్ట్రేలియా.. !!

By AN TeluguFirst Published May 31, 2021, 4:49 PM IST
Highlights

చాలా దేశాలు కరోనాతో ఇబ్బందిపడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం మరో వింత సమస్యతో బెంబెలెత్తిపోతోంది. అవే ఎలుకలు. వేల, లక్షల ఎలుకలు పంటలు, గ్రామాల మీద దాడి చేస్తున్నాయి. దీంతో భయపడిపోతున్న ఆస్ట్రేలియా వాటిని చంపడానికి విషం కావాలంటూ భారత్ ను కోరింది. 

ఆస్ట్రెలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఈ సమస్య మరీ దారుణంగా తయారయ్యింది. ఈ ఎలుకలతో మరే కొత్త మహమ్మారి వస్తుందోనని ప్రజలు, అధికారులు భయాందోళనలో ఉన్నారు. 

దీంతో భారత్ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్ ను దిగుమతి చేసుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఈ ఎలుకల మందును గతంలో ఆస్ట్రేలియా నిషేధించింది. 

అయితే ప్రస్తుతమున్న పాండమిక్ పరిస్థితుల్లో ఎలుకల దాడిని ఆపడానికి ఆ నిషేధిత మందే విరుగుడుగా భావిస్తోంది. అందుకే 5 వేల లీటర్ల బ్రొమాడియోలోన్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకోవలని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయించింది. 

click me!