కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి..

Published : Jul 24, 2023, 05:26 AM ISTUpdated : Jul 24, 2023, 05:29 AM IST
కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి..

సారాంశం

పోర్ట్ సూడాన్ విమానాశ్రయంలో ఓ పౌర విమానం కూలిపోవడంతో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది మరణించారు.

సూడాన్‌లోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో పౌర విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ఆర్మీ సిబ్బంది సహా మొత్తం తొమ్మిది మంది మరణించారు. అయితే ఈ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఆర్మీని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

సాంకేతిక లోపంతోనే..

విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దాని కారణంగానే విమానం కూలిపోయిందని సైన్యం తెలిపింది. "సాంకేతిక లోపం కారణంగా, పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఒక పౌర విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది మరణించారు. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం ఏర్పడి కూలిపోయింది" అని సైన్యం తెలిపింది.
 

విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. గుర్తింపు అనంతరం మృతులందరి పేర్లను కూడా వెల్లడిస్తారు. విమానం కూలిపోయిందన్న సమాచారం తెలియగానే ప్రయాణికుల బంధువులు పెద్దఎత్తున విమానాశ్రయం వద్ద గుమిగూడారు. సాంకేతిక లోపమే ఎయిర్‌పోర్టు విమానం కూలిపోవడానికి కారణమని సూడాన్ ఆర్మీ అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అదుపుతప్పి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం సహాయంతో విమానంలోని మంటలను ఆర్పివేశారు. విమాన ప్రమాదానికి గల కారణాలను అన్వేషించనున్నారు. విమానం శిథిలాలను కూడా సేకరించనున్నారు. 

రెండేళ్ల క్రితం  

సెప్టెంబర్ 2021లో సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ సహా ముగ్గురు అధికారులు మృతి చెందారు.ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది. అల్-షెగిలాబ్ సమీపంలో బుధవారం విమానం కూలిపోయిందని ప్రకటన పేర్కొంది. ఇందులో ముగ్గురు ఆర్మీ అధికారులు మరణించారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే