పెళ్లైన మూడు నిమిషాలకే వధువు షాకింగ్ నిర్ణయం: విడాకులకు పిటిషన్

Published : Feb 10, 2019, 04:07 PM IST
పెళ్లైన మూడు నిమిషాలకే వధువు షాకింగ్ నిర్ణయం: విడాకులకు పిటిషన్

సారాంశం

పెళ్లైన మూడు నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. పెళ్లి కొడుకు తనను  వెక్కిరించాడని పెళ్లికూతురు విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దుబాయ్:పెళ్లైన మూడు నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. పెళ్లి కొడుకు తనను  వెక్కిరించాడని పెళ్లికూతురు విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తనను స్టూపిడ్ అంటూ తిట్టాడని కూడ పెళ్లి కూతురు ఆరోపిస్తోంది. అతడి ప్రవర్తన నచ్చకే విడాకులను కోరినట్టుగా ఆమె చెబుతోంది.

ఈ విడాకుల విషయాన్ని పెళ్లి కూతురే స్వయంగా  సోషల్ మీడియాలో ప్రస్తావించింది. ఈ విషయమై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.  తలో రకంగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

కొందరు పెళ్లి కూతురును సపోర్ట్ చేస్తే, మరికొందరు  పెళ్లి కొడుకును సపోర్ట్ చేశారు. అయితే పెళ్లి చేసుకొన్న మూడు నిమిషాలకే విడాకులు తీసుకోవాలని  నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకొంది.

PREV
click me!

Recommended Stories

చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ
USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక