:కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకొనే క్రమంలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం అతని ఇంటి తలుపు తట్టింది. రూ.46 కోట్లను లాటరీలో గెలుచుకొన్నాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకొంది.
వెల్లింగ్టన్:కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకొనే క్రమంలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం అతని ఇంటి తలుపు తట్టింది. రూ.46 కోట్లను లాటరీలో గెలుచుకొన్నాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకొంది.
లాక్ డౌన్ నేపథ్యంంలో న్యూజిలాండ్ లోని హామిల్టన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం ఉన్న సమయంలో ఆయన ఓ లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేశాడు.
undefined
అతని భార్య హెల్త్ వర్కర్ గా పనిచేస్తోంది. ఉద్యోగం పోవడంతో భర్త ఇంట్లోనే ఉంటున్నాడు.బుధవారం నాడు విధుల నుండి ఇంటికి వచ్చిన భార్యకు కిచెన్ లో టేబుల్ పై కూర్చొన్న భర్త కన్పించాడు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడికి ఉరిశిక్ష
అతని చేతిలో ఓ కవర్ ఉంది.ఈ కవర్ ను ఆయన భార్యకు ఇచ్చాడు.ఈ కవర్ ను విప్పి చూసిన భార్య లాటరీలో రూ. 46 కోట్లు వచ్చిన విషయం ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఉంది. అయితే ఈ విషయం తనకు ఎందుకు చూపిస్తున్నారని భార్య ఆయనను ప్రశ్నించింది.
హామిల్టన్ లో ఈ లాటరీని దక్కించుకొంది మనమేనని భర్త భార్యకు సమాధానమిచ్చాడు. అయితే ఆమె జోక్ చేయవద్దని చెప్పింది. కానీ, భార్యకు తనకు వచ్చిన ఈ మెయిల్ ను చూపాడు. అంతేకాదు లాటరీ సంస్థ వెబ్ సైట్ లో కూడ తాను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టు నెంబర్ ను పోల్చి చూపించాడు.
దీంతో ఆమె ఎంతో సంతోషపడింది. ఈ డబ్బులు ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బుతో తొలుత తమ కారును రిపేరు చేయించాలని నిర్ణయించుకొన్నారు ఆ జంట. ఆ తర్వాత కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు ఈ డబ్బును ఖర్చు చేస్తామని చెప్పారు.