చైనా, ఇటలీ వైరస్ కంటే.. ఇండియా వైరస్సే డేంజర్: భారత్‌పై నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published May 20, 2020, 4:10 PM IST

భారతదేశంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని ఆరోపించారు. 


భారతదేశంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని ఆరోపించారు. ఇండియా నుంచి వచ్చే వైరస్ చైనీస్, ఇటాలియన్ వైరస్ కంటే మరింత ప్రమాదకరమైనదని శర్మ వ్యాఖ్యానించారు.

మంగళవారం దేశ పార్లమెంట్‌లో ప్రసంగించిన కేపీ శర్.. భారత్ నుంచి అక్రమ మార్గాల ద్వారా ఇక్కడికి వచ్చిన వారు నేపాల్‌లో వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారని ఆరోపించారు.

Latest Videos

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుడికి ఉరిశిక్ష

స్థానిక ప్రజా ప్రతినిధులు, కొంతమంది రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఎలాంటి స్క్రీనింగ్ నిర్వహించకుండానే దేశంలోకి అనుమతిస్తున్నారని శర్మ మండిపడ్డారు.

బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఉన్న నేపథ్యంలో కోవిడ్ 19ను కట్టడి చేయడం కష్టంతో కూడుకున్న పని అని ఆయన తెలిపారు. ఇండియా వైరస్ కారణంగా మనదేశంలో ఎంతోమంది ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని శర్మ చెప్పారు.

Also Read:రొట్టె కొనుక్కోడానికి రోడ్డుదాటుతుండగా తెలంగాణ వ్యక్తికి 2 లక్షల ఫైన్!

కాగా ఉత్తరాంఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ కనుమతో కలుపుతూ భారతదేశం రోడ్డు నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్‌కు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ మూడు ప్రాంతాల విషయంలో గత పాలకుల మాదిరిగా వెనుకంజ వేయబోమని, వాటిని సాధించి తీరతామని కేపీ శర్మ వ్యాఖ్యానించారు. ఈ వివాదం జరుగుతుండగానే కరోనాను సాకుగా చూపుతూ భారత్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

click me!