హాహాకారాలు అయిన ఆనందాలు..FootBall Premier league విక్టరీ పరేడ్‌ లోకి దూసుకెళ్లిన కారు!

Published : May 27, 2025, 05:31 AM ISTUpdated : May 27, 2025, 10:21 AM IST
football

సారాంశం

లివర్‌పూల్ విజయం సందర్భంగా అభిమానుల మధ్య కారు దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.

ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరంలో ఆదివారం చోటు చేసుకున్న ఒక ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ప్రీమియర్ లీగ్‌లో 20వ టైటిల్‌ను సొంతం చేసుకున్న లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ తన విజయం వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. మాంచెస్టర్ యునైటెడ్‌తో సమానంగా 20 టైటిళ్లను అందుకున్న నేపథ్యంలో నగరంలో భారీ ఉత్సాహ వాతావరణం నెలకొంది. వేలాది మంది అభిమానులు లివర్‌పూల్ సిటీ సెంటర్ ప్రాంతంలో గుమిగూడి, ఆటగాళ్ల ఊరేగింపును చూసేందుకు తరలివచ్చారు.

ఈ సంబరాల నడుమ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కారుతో వేగంగా వేడుక జరుగుతున్న ప్రదేశంలోకి దూసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పలువురిని అతడు ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ దాడి ఉద్దేశపూర్వకమా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

 దూసుకొచ్చిన కారు..

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ఒక్కసారిగా ప్రజల మధ్యకు  కారు దూసుకొచ్చిన దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం పోలీసు బృందాలు రంగంలోకి దిగి, ఆ కారును ఆపి దుండగుడిని అదుపులోకి తీసుకున్నాయని ప్రకటించాయి. అతని వద్ద నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.

లివర్‌పూల్ జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సందడి, కొద్దిసేపటికి హడావుడిగా మారింది. అభిమానుల ఆనందాన్ని మలుపుతిప్పిన ఈ ఘటన ఇప్పుడు అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయగా, అసాధారణ ప్రవర్తనను ప్రదర్శించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే