అమెరికాలో తెలుగు ఖ్యాతి... న్యూయార్క్ లో రామ్ లాల్ వీధి

By Arun Kumar PFirst Published Jul 18, 2021, 11:38 AM IST
Highlights

 అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని ఓ కాలనీకి భారత మూలాలున్న తెలుగు వ్యక్తి పండిత్ రామ్ లాల్ పేరును పెట్టారు. దీంతో తెలుగు ఖ్యాతి దేశవిదేశాల్లో మరోపారి పరిమళించింది. 

న్యూయార్క్: ప్రపంచ దేశాలకు పెద్దన్నలాంటి అమెరికాలోని ప్రముఖ సిటీ న్యూయార్క్ లో తెలుగు ఖ్యాతి వెల్లివిరిసింది. ఈ పట్టణంలోని ఓ కాలనీకి భారత మూలాలున్న తెలుగు వ్యక్తి పేరు పెట్టి గౌరవించారు.  ప్రముఖ మత గురువు, భాషా పండితులు రామ్‌లాల్‌ పేరును ఓ వీధికి నామకరణం చేశారు అమెరికా అధికారులు. ఈ సందర్భంగా  క్వీన్స్‌ రిచ్‌మండ్‌ హిల్‌లో అధికారిక వేడుక నిర్వహించారు.

గయానాలో భారత మూలాలున్న కుటుంబంలో పుట్టిన రామ్ లాల్ 1979లో అమెరికాలో అడుగుపెట్టారు. మొదట బ్రూక్లిన్ లోని ఓ హాస్పిటల్ లో ఆయన పనిచేశారు. ఈ సమయంలోన ఇండో-అమెరికన్ కమ్యూనిటీ లీడర్ గా ఎదిగారు. ఇదే సమయంలో భారత దేశ మూలాలను మరిచిపోకుండా హిందీ  భాషాభివృద్ధికి కృషి చేశారు. ఇలా అమెరికాలో భారత ఖ్యాతిని నలుమూలలా వ్యాపింపజేసిన ఆయన90ఏళ్ళ వయసులో 2019లో మరణించారు. 

రామ్ లాల్ మరణంతో ఆయన గుర్తుగా లిబర్టీ అవెన్యూలోని 133వ వీధికి ఆయన పేరు పెట్టాలని ఇండో-కరీబియన్ కమ్యూనిటీ ప్రతిపాదించింది. దీనికి గత నెలలో న్యూయార్క్ మేయర్‌ బిల్‌ డె బ్లాసియో ఆమోదం తెలిపారు. దీంతో ఆ వీధి రామ్‌లాల్‌ వీధిగా మారింది. 

click me!