పా‌క్‌లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి కూతురు కిడ్నాప్: చిత్రహింసలు, దాడి

By narsimha lodeFirst Published Jul 18, 2021, 10:05 AM IST
Highlights


పాకిస్తాన్‌లో  ఆఫ్ఘనిస్తాన్  రాయబారి కూతురును గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేసి దాడి చేశారు. ఈ విషయమై ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కూడ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్, ఆప్ఘనిస్తాన్ విదేశీ వ్యవహరాల శాఖలు ఈ విషయమై స్పందించాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.


ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఆఫ్ఘనిస్తాన్  రాయబారి   నజీబుల్లా అలిఖేల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అంతేకాదు ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. శుక్రవారం నాడు  కిడ్నాప్  అయింది. ఆమె కిడ్నాప్ అయిన విసయం తెలిసిన వెంటనే  ఇస్లామాబాద్ సిటీ పోలీసులు  ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరహా ఘటనలను సహించబోమని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు.తన సోదరుడికి గిఫ్ట్ ను కొనుగోలు చేసుకొని ఇంటికి తిరిగి అద్దె వాహనంలో తిరిగి వస్తున్న సమయంలో సెల్సెలా అలిఖేల్ ను బ్లూ ఏరియాలో  కిడ్నాప్ జరిగింది.

ఈ కిడ్నాప్  విషయమై ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కూడ ఓ ప్రకటనను విడుదల చేసింది.  బ్లూ ఏరియా నుండి  ఎఫ్ 7/2 ఏరియాలో ఉన్న తన ఇంటికి  క్యాబ్ లో  వెళ్తున్న సమయంలో   గుర్తు తెలియని వ్యక్తి క్యాబ్ లో ఎక్కాడని తెలిపింది.  కారులోకి గుర్తు తెలియని వ్యక్తి  రావడంపై ఆమె అభ్యంతరం తెలిపింది.  గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అలిఖేల్ పై దాడికి దిగాడని తెలిపింది. మీ నాన్నా ఓ కమ్యూనిష్టు . అతడిని తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారని  ఆ ప్రకటనలో తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి కొట్టి చిత్రహింసలు పెట్టడంతో  ఆమె స్పృహ కోల్పోయింది. సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య  స్పృహలోకి  వచ్చినట్టు ఆ ప్రకటనలో తెలిపింది. ఎఫ్-7 సెక్టార్‌లో  తాను ఉన్నట్టుగా స్థానికులు చెప్పారని, దీంతో  మరో అద్దె వాహనం తీసుకొని  ఇంటికి వెళ్లిందని ఆఫ్ఘన్ ఎంబసీ ఆ ప్రకటనలో వివరించింది.

ఆమె వద్ద వదిలి వెళ్లిన టిష్యూ పేపర్ తో పాటు రూ.50 కరెన్సీ నోటుపై ఓ మేసేజ్ రాసి ఉంది.  నెక్ట్స్  టర్న్ నీదే,  కమ్యూనిష్టుది అంటూ మేసేజ్ రాసి ఉన్నట్టుగా ఆ ప్రకటనలో ఆఫ్ఘన్ ఎంబసీ ప్రకటించింది. ఆమె మొబైల్ ఫోన్ కన్పించకుండా పోయిందని కూడ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహరాల శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.

ఆప్ఘన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలని  కోరింది. నిందితులను పట్టుకొనేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని తెలిపినట్టుగా ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది.పాకిస్తాన్ విదేశీ వ్యవహరాల అధికార ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధురి  ఈ విషయమై స్పందించారు. సెక్యూరిటీ అధికారులు ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించామన్నారు.  నిందితులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఆయన తెలిపారు.

click me!