పనిమనుషుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే రూ.45 లక్షల వరకు జరిమానా !.. ఎక్కడంటే...

Published : Oct 08, 2022, 12:09 PM IST
పనిమనుషుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే రూ.45 లక్షల వరకు జరిమానా !.. ఎక్కడంటే...

సారాంశం

దుబాయ్ లో పనిమనుషుల విషయంలో కొత్త సవరణలు తీసుకువచ్చింది అక్కడి ప్రభుత్వం. వారికి వేతనంతో కూడిన సెలవులతో పాటు.. కొన్ని నిబంధనలను విధించింది. 

దుబాయ్ : యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ పనిమనుషుల రిక్రూట్మెంట్, ఇతర హక్కులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గృహ కార్మికుల పరిరక్షణను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ మానవ వనరులు, ఎమిరేటైజేసన్ మంత్రిత్వశాఖ ఫెడరల్ డిక్రీ లా నెం. 9 ఆఫ్ 2022ను  గురువారం విడుదల చేసింది. ఇది గృహ కార్మిక చట్టంలోని  అన్ని అంశాలను కవర్ చేస్తోంది. కార్మికులు,  యజమానులు, రిక్రూట్మెంట్ ఏజెంట్ లు అనుసరించాల్సిన నిబంధనలు, ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు,  శిక్షలను ఇందులో కూలంకషంగా వివరించడం జరిగింది. 

కొత్త నిబంధనలో గృహ కార్మికులకు పని గంటలు, వారపు విరామాలు,  సెలవులను కూడా పేర్కొన్నారు. చట్ట కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం కార్మికులకు వారానికి వేతనంతో కూడిన ఒక సెలవు దినం  తప్పనిసరి. ఇక చట్టంలోని ఆర్టికల్ 27ని గృహ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే వారికి విధించే జరిమానాలను వివరిస్తుంది. యూఏఈలో చట్ట విరుద్ధంగా గృహ కార్మికులను నియమించుకునే వ్యక్తులకు కనీసం యాభై వేల దిర్హామ్స్ (రూ.11.27లక్షలు)నుంచి 2 లక్షల దిర్హామ్స్ (రూ.45లక్షలు)వరకు జరిమానా విధించబడుతుందని ఆర్టికల్ 27 లోని క్లాజ్ (3)లో పేర్కొంటోంది.పాకిస్తాన్ వరదలు.. 1,700కు చేరిన మృతుల సంఖ్య.. 12,000 మందికి పైగా గాయాలు

అలాగే గృహ కార్మికుల కోసం జారీ చేసిన వర్క్ పర్మిట్ లను దుర్వినియోగం చేసినా, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్మికులను నియమించుకున్నా కూడా ఇదే పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పనిమనుషులకు యూఏఈ  పూర్తి రక్షణాత్మక వ్యవస్థను తీసుకు వస్తుంది. ఇప్పటికే అక్కడి సర్కార్  విదేశీయులకు వీసా విధానాలను పూర్తిగా సరళతరం చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలను చూస్తుంటే విదేశీ కార్మికులకు ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?